Unhappy with England players' pullouts, IPL franchises mull complaining to BCCI

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 మొదటి ఎడిషన్ ప్రారంభమవుతుంది. ఈసారి సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఈ తరుణంలోనే ఎడిషన్ ల వారీగా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్లేయర్లు తమ హోమ్ గ్రౌండ్ లకు చేరుకున్నారు.IPL 2024

Unhappy with England players pullouts, IPL franchises mull complaining to BCCI

అయితే ఇలాంటి నేపథ్యంలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక్కో ప్లేయర్… ఐపీఎల్ 2024 టోర్నమెంటును వీడుతున్నారు. ఈసారి మినీ వేలం కంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఆ జట్టును విడిపోయారు. టి20 వరల్డ్ కప్ పై దృష్టి పెట్టేందుకు ఐపిఎల్ ఆడబోనని ముందే ప్రకటించాడు బెన్ స్టోక్స్. అలాగే…. మొన్నటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన హ్యారీ బ్రూక్ కూడా ఈసారి ఐపీఎల్ ఆడటం లేదు.IPL 2024

Also Read: RCB: టైటిల్ రాత మారడం లేదని పేరు మార్చిన RCB

ఐపిఎల్ 2024 టోర్నమెంట్ కంటే ముందు జరిగిన వేలంలో హ్యారీ బ్రూక్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని వదిలేసుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా నాలుగు కోట్లు పెట్టి…హ్యారీ బ్రూక్ కొనుగోలు చేసింది. చివరికి క్షణంలో కుటుంబ సమస్యలు చెప్పి ఇంగ్లాండ్ పయనం అయ్యాడు హ్యారీ బ్రూక్. అటు కేకేఆర్ ప్లేయర్, ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయి కూడా ఈసారి ఐపీఎల్ ఆడటం లేదు. ఇలా వరుసగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ టోర్నమెంట్ను వదిలేస్తున్నారు. అప్పటివరకు బాగానే ఉండి టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. IPL 2024

అయితే దీనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు చాలా సీరియస్ అవుతున్నాయి. విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐపై ఒత్తిడి చేస్తున్నాయి. ఐపీఎల్ హక్కు అనుషయంగా దూరమవుతున్న విదేశీ ప్లేయర్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఐపిఎల్ ఫ్రాంచైజీలు కోరాయట. చిన్నచిన్న కారణాలు చెప్పి విదేశీ ఆటగాళ్లు టోర్నీని వీడుతున్నారని… ఒకసారి ఐపిఎల్ లో రిజిస్టర్ అయ్యాక కచ్చితంగా టోర్నమెంట్ ఆడాల్సిందేనని ఒక రూల్ పెట్టాలని సూచించారట. దీంతో బీసీసీఐ కూడా సరికొత్త రోల్ తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మొదటగా ఇంగ్లాండ్ ప్లేయర్లపై ఈ రూల్ ప్రయోగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.IPL 2024

Join WhatsApp