Virat Kohli absolutely furious with the Umpire Decision On No Ball

Virat Kohli: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏమాత్రం రాణించడం లేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు విఫలం కావడంతో పాటు ఆ జట్టుకు దరిద్రం కూడా పట్టుకుంది. ఆ దరిద్రం కారణంగా ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి ఏడు మ్యాచ్లో ఓడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక ఆదివారం రోజున కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో కూడా దరిద్రం కారణంగానే ఆర్సిబి ఓడిపోయింది. ఎంపైర్ తప్పులు, ఆటగాళ్ల ఫెయిల్యూర్ కారణంగా దారుణంగా ఓడిపోయింది ఈ బెంగుళూరు.Virat Kohli

Virat Kohli absolutely furious with the Umpire Decision On No Ball

కోల్కతా వర్సెస్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో ఒక్కటంటే ఒక్క పరుగుతో కేకేఆర్ విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 222 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నానా ఇబ్బందులు పడింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు. కాని చివర్లో కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హర్షిత్ రానా బౌలింగ్లో కాటన్ బోల్డ్ అవుట్ అయ్యాడు.Virat Kohli

Also Read: Sunrisers Hyderabad: ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతోంది… ఈసారి SRH దే కప్ ?

అయితే వాస్తవానికి విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న బంతి నో బాల్ అని ఆర్సిబి వాదిస్తోంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం… కోహ్లీని అవుట్ గా ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం వివాదంగా మారింది. మరి ఇది అవుటా ? లేదా నాట్ అవుటా ? అనే విషయాన్ని తెలుసుకుందాం. క్రికెట్ నియమ నిబంధనాల ప్రకారం… నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బందుల విషయంలో రూల్ 41.7.1 లో క్లారిటీ ఇచ్చారు. Virat Kohli

బాలు ఫుల్ టాస్ గా వచ్చిన బంతి క్రిస్ లో నిలబడి ఉన్న బ్యాటర్ కు నడుము కంటే ఎక్కువ ఎత్తులో వస్తే… అది నో బాల్ గా పరిగణిస్తారు. కానీ కోహ్లీ విషయంలో అలా జరగలేదు. విరాట్ కోహ్లీ నడుము హైట్ 1.04 మీటర్ల వద్ద బంతి వచ్చింది. అయితే అప్పుడు క్రేజ్ బయటికి వచ్చి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. ఆ బంతి గ్రీస్ లోపటికి వెళ్లే సమయానికి… 0.92 మీటర్ల ఎత్తులో ఉంటుందని ఎంపైర్ భావించారు. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ క్రేజు లో ఉంటే… ఆ బంతి నడుము కంటే కిందికి వచ్చేది అని దాని అర్థం. ఈ లెక్కన అప్పుడు కూడా విరాట్ కోహ్లీ అవుట్ అవుతాడు. ఇదే విషయాన్ని ఎంపైర్లు స్పష్టం చేశారు. ఎలా చూసుకున్నా విరాట్ కోహ్లీ అవుట్ కావాల్సిందే అన్నమాట.Virat Kohli

Join WhatsApp