Vvs Laxman as BJP MP from Pedpadalli

Vvs Laxman: త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 15వ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఎలాగైనా ఈసారి బిజెపి గెలవాలని చూస్తోంది. సర్వేలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రధానిగా అవతరిస్తారని చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా ఎక్కువ స్థానాలలో ఎంపీ సీట్లు గెలవాలని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.Vvs Laxman

Vvs Laxman as BJP MP from Pedpadalli

ఏ మాత్రం ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని బయటికి తీసుకు వస్తోంది బిజెపి. ఈ నేపథ్యంలో తెలంగాణపై కూడా భారత జనతా పార్టీ కన్ను పడింది. ఈసారి డబుల్ డిజిట్ సీట్లు తెలంగాణలో గెలవాలని బిజెపి పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బిజెపి పార్టీ ముందుకు వచ్చింది.Vvs Laxman

Also Read: IPL 2024: RCBకి బిగ్ షాక్.. IPL 2024 నుంచి కోహ్లీ ఔట్‌ ?

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని లక్ష్మణ్ ను బిజెపి పెద్దలు అడిగారట. మొన్నటి వరకు వి6 వివేక్ బిజెపి పార్టీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. దీంతో పెద్దపల్లి బిజెపి కాండేట్ ఫైనల్ కాలేదు. మంచి వ్యక్తిని బరిలో దింపితే కచ్చితంగా గెలుస్తామని బిజెపి భావిస్తుంది. ఈ తరుణంలోనే వివిఎస్ లక్ష్మణ్ ను పెద్దపల్లి ఎంపీగా దింపాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుందట. దీనికి వివిఎస్ లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.Vvs Laxman

కాగా 1996 నుంచి 2012 వరకు టీమిండియా కు సేవలు అందించారు వివిఎస్ లక్ష్మణ్. ఈ నేపథ్యంలోనే 134 టెస్టులలో దాదాపు 18 వేల పరుగులు చేశారు. అటు వన్డే క్రికెట్లో కూడా అద్భుతంగా రానించారు. ఎందారు వన్డే మ్యాచ్లో ఆడిన లక్ష్మణ్ 2300 పరుగులు చేశాడు. అటు ఐపిఎల్ టోర్నమెంట్లో 20 మ్యాచ్లు ఆడిన లక్ష్మణ్ 282 పరుగులు మాత్రమే చేసి రిటైర్మెంట్ ఇచ్చాడు.Vvs Laxman

Join WhatsApp