Will Virat Kohli not play Test cricket anymore

Virat Kohli: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఓటమిపాలైన టీమిండియా జట్టుకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ లో మిగతా టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం అందుతుంది. మొన్న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది.

Will Virat Kohli not play Test cricket anymore

జనవరి 25వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్… నాలుగు రోజుల్లోనే ముగిసింది. అయితే ఈ అనూహ్యమైన మ్యాచ్లో… టీమిండియా అన్ని విభాగాలలో విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా రాణించలేకపోయాడు. దీంతో రోహిత్ సేన దారుణంగా ఓడిపోయింది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read: IND vs ENG: కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మ తొలగింపు ?

అంతేకాకుండా మొదటి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే… మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయేదని అంటున్నారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ చాలా చక్కగా ఆడేవాడని… కానీ అతడు లేని కారణంగా టీమిండియా ఓడిపోయిందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో విశాఖ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ కు కూడా ముందే చెప్పినట్లు కోహ్లీ దూరం అవుతారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్తో జరిగే… మిగతా మూడు టెస్ట్ మ్యాచ్లకు కూడా విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమైన విరాట్ కోహ్లీ… కొన్ని అనివార్య కారణాలవల్ల మరోమూడు టెస్ట్ మ్యాచ్లకు కూడా దూరం కానున్నట్లు సమాచారం అందుతుంది. విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ లివర్ సమస్యతో బాధపడుతున్నారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని స్పష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో తన తల్లిని దగ్గరుండి చూసుకునేందుకు విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నారట.

Virat Kohli Most Popular Asian Man in 2023

ఈ కారణంగానే సిరీస్ మొత్తానికి దూరం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు బీసీసీఐ అధికారులతో కూడా విరాట్ కోహ్లీ పర్మిషన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ కి బీసీసీఐ అధికారులు కూడా… అనుమతులు ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరో మూడు టెస్టులలో టీమిండియా జట్టు కష్టాలను ఎదుర్కోక తప్పదు. (Virat Kohli)

Join WhatsApp