Will Virat Kohli Play IPL 2024

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక మొట్టమొదటి మ్యాచ్ మార్చి 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మేరకు తొలి విడుదల భాగంగా 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది బీసీసీఐ పాలకమండలి.IPL 2024

Will Virat Kohli Play IPL 2024

ఇలాంటి నేపథ్యంలో ఆర్సిబి జట్టుకు బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం అందుతుంది. ఈసారి జరిగే ఐపీఎల్ టోర్నమెంట్లో ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కనిపించకపోవచ్చు అని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నుంచి పూర్తిగా విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయ జట్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో మొదట విరాట్ కోహ్లీ సెలెక్ట్ చేశారు.IPL 2024

Also Read: IND vs ENG: రాంచీ టెస్టులో టీమిండియా విక్టరీ.. ఈ విజయం వెనుక 5 కారణాలు..!

కానీ తన కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆ సీరియస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ రెండవసారి కూడా తండ్రి అయ్యాడు. అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు ఫిబ్రవరి 15వ తేదీన జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ దంపతులు అధికారికంగా ప్రకటించారు. అయితే కుటుంబంలో సంతోషకరమైన వార్త ఉన్న నేపథ్యంలో… ఆర్సిబి ఫ్యాన్స్ కు విరాట్ కోహ్లీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.IPL 2024

ఇదే విషయాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ వెల్లడించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడని చెప్పుకు వచ్చారు సునీల్ గవాస్కర్. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ… ఐపీఎల్ 2024 టోర్నమెంట్కు కూడా దూరం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని… సన్నీ బాయ్ అభిప్రాయపడ్డారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా తమ కోసం ఆడాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.IPL 2024

Join WhatsApp