4K Smart TV’s: మంచి టీవీ ని కొనుక్కోవాలని చూస్తున్నారా..? అయితే ఈ టీవీలు మీకోసమే. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం లో పర్ఫెక్ట్ టీవీ కోసం ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు కూడా అలానే చూస్తుంటే ఈ టీవీలు చూడండి. పనితీరు, ఫీచర్‌లు అలానే కాస్ట్ కూడా చూసి ప్రతీ ఒక్కరు కూడా మంచి టీవీను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో పెరిగిన సాంకేతికత అభివృద్ధితో 4 కే టీవీలు వచ్చాయి. పైగా వీక్షకులకు అసాధారణమైన స్పష్టతతో పాటు మంచి అనుభవాన్ని ఇస్తాయి. 4కే టీవీ లు మనకి రూ. 40,000లోపులోనే అందుబాటులో వున్నాయి. ఇక టీవీల కి సంబంధించి వివరాలు చూసేద్దాం…

4K Smart TV’s with theater experience at home and super features

వన్‌ప్లస్‌ 43 అంగుళాల 4కే టీవీ విషయానికి వస్తే… వన్ల్‌ ప్లస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ, ఎల్‌ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీ తో అలానే స్లిమ్‌ డిజైన్‌ తో వస్తోంది. అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, క్రోమ్‌కాస్ట్, మిరాకాస్ట్ తో పాటు వన్‌ప్లస్ కనెక్ట్ ఎకోసిస్టమ్, గూగుల్ , డిఎల్‌ఎన్‌ఎ సపోర్ట్ వంటి స్మార్ట్ ఫంక్షనాలిటీలను కలిగి వుంది. ఇది 24 వాట్స్‌ వరకు క్రిస్టల్-క్లియర్, హై-డెఫినిషన్ ఆడియో అవుట్‌పుట్‌ను ఇచ్చారు. మంచి స్పీకర్లతో వస్తోంది. ఇక ఎల్‌జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ విషయానికి వస్తే.. ఎల్‌జీ ఏఐ ప్రాసెసర్ 4కే జెన్‌6 50 అంగుళాలతో వచ్చే అల్ట్రా హెచ్‌డీ టీవీ. డైనమిక్ టోన్ మ్యాపింగ్ ఫీచర్‌ తో వస్తోంది. టోన్ కర్వ్‌ను ఇచ్చారు.

Also read: Revanth Reddy: భవిష్యత్తు అవసరాలకి సమగ్ర ప్రణాళిక..!

వాస్తవిక హెచ్‌డీఆర్‌, మెరుగైన కాంట్రాస్ట్‌ కూడా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యాపిల్‌ టీవీ ప్లస్‌ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను డైరెక్ట్ గా టీవీ లోనే మీరు చూడవచ్చు. ఎల్‌జీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ చూస్తే.. 10 ప్రోతో పని చేసే ఎల్‌జీ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ఇది. ఏఐ సౌండ్ ప్రో ఫీచర్ 5.1 స్పీకర్లకు సమానమైన సరౌండ్ సౌండ్ ఇచ్చారు. సామ్‌సంగ్‌ క్రిస్టల్‌ విజన్‌ 4కే వివిడ్, లైఫ్‌లైక్ ఇమేజ్‌లు, లీనమయ్యే 3డీ సరౌండ్ సౌండ్ వంటి ఫంక్షనాలిటీలను కలిగి వుంది (4K Smart TV’s).

Join WhatsApp