5G phones: రియల్ మీ ఇటీవల అతి తక్కువ బడ్జెట్ లో సూపర్ స్మార్ట్ ఫోన్ ని తీసుకుని వచ్చింది. రియల్ మీ సీ65 పేరుతో వచ్చిన ఫోన్ రూ. 10,499 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… రియల్ మీ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ చిప్ సెట్ అలానే 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ని కలిగి వుంది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లతో వస్తుంది. మూడింటి లోనూ వేరు వేరు ర్యామ్ అలానే స్టోరేజ్ సామర్థ్యాల తో వస్తాయి. ఈ ఫోన్ కి రెండు కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రియల్ మీ సీ 65 స్మార్ట్ ఫోన్ కి వివో టీ3ఎక్స్ 5జీ నుంచి పోటీ కూడా ఉంది. వివో స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే లంచ్ అయ్యింది. 5జీ వేరియంట్ గా వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ ధర లో అందుబాటులో వుంది.

5G phones in less price

ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే.. స్నాప్ డ్రాగన్ 6 జెన్1 చిప్ సెట్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ అలానే యూనిట్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ని ఇది కలిగి ఉంటుంది. Vivo T3x , Realme C65 5G లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడే చూసేద్దాం. వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ 4జీబీ, 128జీబీ స్టోరేజ్ కలిగి వుంది. దీని ధర రూ. 13,499 నుంచి స్టార్ట్ అవుతోంది.

Also read: Smartphones: తక్కువ బడ్జెట్లో లాంచ్ అయిన కొత్త ఫోన్లు..!

6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 16,499. రియల్మీ సీ65 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి రూ. 10,499, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 12,499, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 12,499గా ఉంటుంది. వివో టీ3ఎక్స్ 5జీ ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారితమైన ఆండ్రాయిడ్ 14 ఉంటుంది. అదే విధంగా రియల్మీ సీ65 5జీ ఫోన్లో రియల్ మీ యూఐ 5.0తో కూడిన ఆండ్రాయిడ్ 14 ఉంటుంది (5G phones).

Join WhatsApp