Smartphones : ఈరోజుల్లో చాలా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మెరుగైన నాణ్యత సమర్థవంతమైన పనితీరు కలిగిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి. కొత్త ఫీచర్ల తో మంచి స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాయి. బ్యాటరీ సామర్థ్యం కెమెరా క్వాలిటీ లో కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మొత్తానికి వినియోగదారులకి పెట్టిన డబ్బులకి రెట్టింపు సేవలు అందిస్తున్నాయి. 20000 లోపు ధరలోనే ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు సామాన్యులకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఫోన్ లకి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం.

5G Smartphones in budget

ఐకూ జెడ్9(iQOO Z9 5G) ఫోన్ 2000లలో అందుబాటులో ఉంది. 8gb ryam128gb స్టోరేజ్ తో వస్తుంది. రూ.19,999కు వచ్చేస్తోంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో రూ.21,999కు లభిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్‌ప్లే తో డస్ట్, తేలికపాటి వాటర్ రెసిస్టెంట్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. మీడియో టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 1 టీబీ వరకూ ఎక్స్టెండ్ చేసుకునే మైక్రో ఎస్ డీ తో ఈ ఫోన్ వస్తోంది. 50 ఎంపీ సోనీ ఫ్రైమరీ సెన్సార్, వెనుకవైపు 2 ఎంపీ డెప్త్ సెన్సార్ తో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ని ఇచ్చారు.

Also read: Chandra Babu: ఐదేళ్ల పాలనలో ముప్పై ఏళ్ళు వెనక్కి..!

ఇక రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే ని ఇచ్చారు. మీడియా టెక్ డైమన్సిటీ 7050 ప్రాసెసర్ కారణంగా ఇది పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో రూ.19,999 కి వస్తుంది. 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అలానే 2 ఎంపీ మాక్రో షూటర్ దీనిలో వున్నాయి. 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తో సెల్ఫీలు తీసుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 67వాట్ల చార్జర్ తో ఫాస్ట్ చార్జింగ్ ని ఇది కలిగి వుంది (Smartphones).

Join WhatsApp