5k Discount on this Samsung Galaxy F54 Mobile

Samsung Galaxy F54: ప్రపంచ ఫోన్ మార్కెట్ లో ఆపిల్ తర్వాత అంతటి ఆదరణ పొందిన ఫోన్లు సాంసంగ్. ఈ మొబైల్ ఒకసారి వాడిన వారు మరో మొబైల్ వాడడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి సామ్సంగ్ మొబైల్ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో మొబైల్స్ రిలీజ్ అయి దూసుకుపోతున్నాయి. ఇదే తరుణంలో సాంసంగ్ నుంచి గెలాక్సీ F 54, 5జి మొబైల్ రిలీజ్ అయి రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇదే తరుణంలో ఈ మొబైల్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, తగ్గింపు వివరాలు చూద్దాం..

5k Discount on this Samsung Galaxy F54 Mobile

సాంసంగ్ గెలాక్సీ f54,5g మొబైల్ 30 వేల రూపాయల ధరతో రిలీజ్ అయింది. అంటే దీని విడుదల సమయంలో రూ:29,999 గా ఉన్నది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ను రూ:24,999కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా ఎన్నో బ్యాంక్ ఆఫర్లు ఎక్స్చేంజి ప్రయోజనాల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే దాదాపు 5 వేల వరకు తగ్గింపు లభించే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు చూద్దాం.

Also Read: Infinix Smart 8 Pro: తక్కువ ధరకే Infinix మొబైల్‌…ఫీచర్స్‌ ఇవే

సాంసంగ్ స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256 జిబి అంతర్గత స్టోరేజ్ వేరియంటు ధర రూ:24,999ఉంది. ఈ మొబైల్ ను ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ:2000 తక్షణ తగ్గింపు పొందుతారు. అంతేకాకుండా సాంసంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే కూడా రూ:2000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే రిఫరల్ కోడ్ ద్వారా 5 శాతం డిస్కౌంట్, మోబిక్విక్ వాలెట్ ద్వారా 15% డిస్కౌంట్ ని పొందుతారు.

Samsung Galaxy F54: 5k discount on this Samsung mobile

అంతేకాకుండా ఈ మొబైల్ పై ఈఎంఐ, ఎక్స్చేంజ్, ఆఫర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 inch ఫుల్ హెచ్ డీ +, సూపర్ AMOLED + డిస్ప్లే ను కలిగి ఉంది. అంతేకాకుండా అండర్ ది హుడ్ ఎగ్జినోస్ 1380 చిప్ సెట్ కలిగి ఉంది. అలాగే ఈ మొబైల్ 6000Mah బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా, 25W చార్జింగ్ సపోర్ట్, వెనుక వైపు త్రిపుల్ కెమెరా , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 108 ఎంపీతో కూడిన ప్రధాన కెమెరా , 8 ఎంపీ, 2ఎంపీ కెమెరాలను కలిగి ఉంది. అలాగే సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరాను కలిగి ఉన్నది.(Samsung Galaxy F54)

Join WhatsApp