AI: ఈరోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం భారీగా పెరిగింది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధా వినియోగం అనివర్యంగా మారింది. దాదాపు అన్ని సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నాయి. యాప్స్ లో కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా అమెజాన్ మ్యూజిక్ యాప్ లో ఏఐ ఫీచర్ ని యాడ్ చేశారు. ఇప్పటికే స్పాటిఫై ఇటీవల ప్రీమియం యూసర్ల కోసం ఏ ఆధారిత ఆ ప్లే లిస్ట్ జనరేటర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా అమెజాన్ సైతం ఇటువంటి ఫీచర్ ని ప్రవేశపెట్టింది.

AI in music app

మాస్ట్రో పేరుతో ఈ కొత్త ఫీచర్ ని తీసుకువచ్చారు. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు ఈజీగా ఆన్లైన్ లో పాటలు వినొచ్చు. తాజాగా ఈ మ్యూజిక్ యాప్స్ జోడిస్తున్నాయి. ప్రామ్ప్ట్స్ ఆధారంగా ప్లే లిస్ట్ లోనే క్రియేట్ చేయడమే కాదు ఎమోజీలతో పనిచేస్తుంది. మాస్ట్రో సృష్టించిన ప్లే లిస్ట్ లని తర్వాత ఎప్పుడైనా ఆ వినాలనుకుంటే సేవ్ చేయొచ్చు. ఇతరులతో కూడా షేర్ చేసుకోవచ్చు.

Also read: Smartphone: ఈ ఏడాది లాంచ్‌ అయిన బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. బడ్జెట్ లోనే..!

అభ్యంతరమైన కంటెంట్ ని అడ్డుకోవడానికి ఇందులో ప్రత్యేక ఫీచర్ ని తీసుకువచ్చారు. బీటా వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతోంది. ఒకప్పుడు పాటలు వినాలనుకుంటే మెమరీ కార్డులో మనం పాటల్ని లోడ్ చేసుకునే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్లో ఎవరికి వాళ్లే డౌన్లోడ్ చేసుకునే రోజులు వచ్చాయి. స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చాక స్ట్రీమింగ్ తీరు కూడా మారిపోయింది. ఏదేమైనా రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అనేక కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏఐ హవా నడుస్తోంది. ముందు ముందు ఏఐ మొత్తం అంతా నడిచేలా ఉంది (AI).

Join WhatsApp