Android 15: గత ఏడాది గూగుల్ కొత్త గూగుల్ పిక్సెల్ ఎయిట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని తీసుకొచ్చింది ఇప్పుడు గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది ఇది ప్రారంభించిన తర్వాత మొబైల్లో ఫైల్స్ ని స్వయంచాలకంగా తొలగించే టెన్షన్ ఉండదు. కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఇక దీని గురించి వివరాలను చూసేద్దాము.. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తర్వాత గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 ని స్టార్ట్ చేయాలని అనుకుంటోంది.

Android 15 new features

ఈ సమాచారం ఏవో ఎస్పీ అంటే ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులో వెళ్లడయింది అయితే ఈ ఆండ్రాయిడ్ 15 కొత్త ఏపీఐ లో పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఫోన్ హెల్త్ స్టోరేజ్ ఇతర విషయాల గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. గూగుల్ కి చెందిన రాబోయే ఆండ్రాయిడ్ 15 ఓఎస్ లో మొబైల్ స్టోరేజ్ గురించి సమాచారాన్ని మాత్రమే పొందలేరు. మీరు నిల్వను అయిపోయే సమయ పరిమితి గురించి కూడా సమాచారాన్ని పొందడానికి అవుతుంది.

Also read: Revanth Reddy: రాజ్యాంగాన్ని రక్షించాలి అంటే.. రాహుల్ ప్రధాని కావాలి..!

ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 ఓఎస్ పిక్సెల్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుందా లేదా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అందుబాటులోకి వస్తుందా అనేది తెలీదు. ఫోన్ ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా ట్రాకింగ్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ పరికరం లో ఉన్న ప్రీ-కంప్యూటెడ్ బ్లూటూత్ బెకన్, బ్లూటూత్ కంట్రోలర్ సిస్టమ్‌లో వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15లో పని చేసే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ వర్క్ కాదు. ఈ ఫీచర్ కోసం ఫోన్‌ సంబంధిత హార్డ్‌వేర్ లక్షణాలు ఉండాలి. అటువంటప్పుడు ఆండ్రాయిడ్ 15 పాత స్మార్ట్‌ఫోన్‌లో వస్తే ఈ ఫీచర్ దానిలో పని చేయదు. రాబోయే పరికరాల్లో ఇటువంటి హార్డ్‌వేర్ ఫీచర్‌ను జోడించవచ్చు. నివేదికల ప్రకారం ఈ ఫీచర్ Google Pixel 9 సిరీస్‌లో అందించే అవకాశం ఉంది (Android 15).

Join WhatsApp