Android Security Update December 2023

Android Security Update: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ మొబైల్ అనేది ఉండనే ఉంటుంది.. ఇదే సమయంలో హ్యాకర్ల బారిన పడ్డ సందర్భాలు కూడా ఉంటాయట.దీంతో చాలా మంది జాగ్రత్త పడేందుకు పలు రకాల అప్డేట్లను సైతం చేస్తూ ఉండడం చాలా ముఖ్యమట.. గూగుల్ సంస్థ ఈ నెలలో సెక్యూరిటీ అప్డేట్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది దీంతో ఆండ్రాయిడ్ వినియోగదారులు అప్డేట్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దీని వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుందట.

ఆండ్రాయిడ్ మొబైల్ అప్డేట్ అడిగినప్పుడు చేయకపోతే హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంటుందట.. ఇలా చాలా మంది తెలియక అప్డేట్ చేయక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గూగుల్ సంస్థ తెలియజేస్తోంది. దీనివల్ల ఆండ్రాయిడ్ 11 నుంచి 14 తో సహా ఇతర ఆండ్రాయిడ్ వర్షన్ లో ఉండేటువంటి యూజర్స్ సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అందుకే ఖచ్చితంగా మొబైల్ అప్డేట్ అడిగినప్పుడు చేయడమే మంచిదని తెలియజేస్తున్నారు.

Android Security Update December 2023

మీడియా టెక్ , క్వాల్ కం, యూనిసొక్ ఇతరత్రా మ్యానుఫ్యాక్చర్ల సరఫరా చేసే కాంపోనెంట్స్ తో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని వీటన్నిటిని ఈ నెలలో సెక్యూరిటీ ప్యాచ్ కింద అప్డేట్ చేసుకోవాలని తెలియజేస్తోంది. ఈ అప్డేట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుపుతున్నారు. అయితే ఈ అప్డేట్లను ముందుగా శాంసంగ్ ,గూగుల్ పిక్సెల్ కలిగిన మొబైల్స్ వారు ఈ అప్డేట్లను మొదట పొందుతారని తెలియజేస్తున్నారు. మిగతా బ్రాంచ్ కలిగిన మొబైల్ లకు పది రోజుల తర్వాత అందుబాటులో వస్తుందట.

Also Read: Vacuum Cleaner: చౌక ధరికే లభించే వ్యాక్యూమ్ క్లీనర్..!!

ఆండ్రాయిడ్ డివైస్లు ఉన్నవారు డిసెంబర్లో సెక్యూరిటీ అప్డేట్లను సాధారణ అప్డేట్లను చేసుకోవాలని తెలుపుతోంది.ఈ లేటెస్ట్ వర్షన్ ను ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే స్కాములు ఇతరత్రా ఫ్రాడ్ హ్యాకర్ల బారిన పడే అవకాశం అసలు ఉండదట. అందుకే వెంటనే అప్డేట్లను అన్నిటిని కూడా చేసుకోవాలని తెలియజేస్తోంది. అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు మొబైల్ హ్యాంగ్ కావడమే కాకుండా డిస్ప్లే కూడా బ్లర్ గా మారుతుంది.. దీనివల్ల కొన్నిసార్లు మనం అనుకోకుండానే చాలా రకాలుగా టెక్నికల్ ఇష్యూలను కూడా ఫేస్ చేయవలసి ఉంటుందట. (Android Security Update)

Join WhatsApp