Apple’s Possible Entry Into Foldable Devices In 2026

Apple: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది రకరకాల స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్స్ కాలంగా ఈ యుగం మారిపోయింది. ఇక్కడ చూసిన స్మార్ట్ ఫోన్స్ వాడడం మనం చూస్తున్నాం. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రకరకాల మొబైల్ ఫోన్లను… ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. తక్కువ ధరలో అలాగే ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు.

Apple’s Possible Entry Into Foldable Devices In 2026

మొన్నటివరకు 4g స్మార్ట్ ఫోన్స్ విపరీతంగా విక్రయాలు జరుపుకున్నాయి. అయితే ఇప్పుడు 5జి కాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరు 5జి మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ 5g మొబైల్స్ లో అనేక ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఫోల్డబుల్ డిస్ప్లే తో కూడా లాంచ్ చేశాయి.Apple

Also Read: Instagram Message Editing: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎడిట్‌ ఆప్షన్‌.. మెసేజుల్లో పొరపాట్లకు చెక్‌

సాంసంగ్, వన్ ప్లస్ , మోటో ఇలాంటి ఎన్నో కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్స్ ను ఫోల్డబుల్ డిస్ప్లే తో తీసుకోవచ్చాయి. అయితే ఈ దిశగా ఆపిల్ కంపెనీ కూడా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇతర కంపెనీలకు దీటుగా ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకువచ్చేందుకు ఆపిల్ సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.Apple

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… 7.6 నుంచి 8.4 అంగుళాల మధ్య పెద్ద డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసేందుకు ఆపిల్ నిర్ణయం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ను 2026 వరకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఇక వీటి ధర 50 వేల పైన ఉండే అవకాశాలు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇతర స్మార్ట్ ఫోన్స్ కంటే… మంచి ఫీచర్స్ యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఆపిల్. అప్పటివరకు వినియోగదారులు వేచి ఉండాలని కోరింది.Apple

Join WhatsApp