WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat

Whatsapp : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన ఎంతో ఈజీగా మనం ఫొటోస్ వీడియోస్ వంటివి షేర్ చేసుకోవచ్చు. అయితే భారత్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కనుక వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి అంటే అందుకు బదులుగా మనం ఏ యాప్స్ ని వాడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. కొన్ని విషయాల్లో భారత ప్రభుత్వం తమని బలవంతం పెడితే తాము భారతదేశం నుండి వైదొలుకుతామని వాట్సాప్ సంస్థ ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు వాట్సప్ పై చర్చ జరుగుతోంది.

Apps similar to Whatsapp

దేశంలోని చట్టాలకంటే వినియోగదారుల గోప్యతను కాపాడడమే ముఖ్యమని వాట్సప్ చెప్పింది. అదేవిధంగా భారతదేశం తాజా ఐటీ నిబంధనలకి వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టుని ఆశ్రయించింది. ఈ సందేశాలు ఎన్క్రిప్ట్ చేపడతాయి అందుకని మూలాన్ని కొనసాగడం సాధ్యం కాదు. వాట్సాప్ ఎంక్రిప్షన్ సిస్టం ని తొలగించబోమని అలా చేయమని బలవంతం చేయద్దు అది చేస్తే భారతదేశం నుండి నిష్క్రమిస్తుంది అని అన్నారు. ఈ యాప్ భారతదేశంలో అందుబాటులో లేనట్లయితే ప్రత్యామ్నాయ మెసెసింగ్ యాప్స్ ఏమున్నాయి, ఎటువంటి యాప్స్ వినియోగించవచ్చు అనేది చూద్దాం. వాట్సాప్ కంటే టెలిగ్రామ్ వినియోగదారుల గోప్యతకు కట్టుబడి ఉంటుంది అందుకని టెలిగ్రామ్ నమ్మకమైన వినియోగదారు స్థావరాన్ని నిర్మించింది.

Also read: విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సాఝాన్సీవిజయానికి ఎనిమిది కారణాలు

రెండు లక్షల మంది సభ్యుల్ని కవర్ చేయగల గ్రూప్ ని సృష్టించచ్చు. హైక్ కూడా బాగుంటుంది. వివిధ రకాల స్టిక్ ప్యాక్లని కలిగి ఉంది. హైక్ స్టిక్కర్ చాట్ ని కూడా వాడొచ్చు అలానే జియో చాట్ మరొక గొప్ప యాప్. ఇందులో వీడియో కాన్ఫరెన్స్, వాయిస్ కాల్స్, ఫైల్స్ షేరింగ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. అలానే సిగ్నల్ యాప్ ని కూడా వాడొచ్చు ఇది కూడా వినియోగదారుల గోప్యతను రక్షించడంలో టెలిగ్రామ్ కంటే ఒక అడుగు ముందుంది. ఇది కూడా మంచి యాప్. స్కైప్ కూడా మంచి మెసేజ్ సేవలు అందిస్తోంది ఈ కార్పొరేట్ రంగంలో కూడా ప్రాధాన్యత ఉంది (Whatsapp).

WhatsApp Introduces Feature To Pin Up To 3 Messages In Chat
Join WhatsApp