Ask QX AI Tool: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని వాడే వాళ్ళు రోజు రోజుకీ ఎక్కువై పోయారు. ఇది ఇలా ఉంటే సాంకేతికతతో వచ్చిన చాట్‌జీపీటీ గ్లోబల్ వైడ్‌గా సృష్టించిన సంచలనం కూడా మన అందరికీ తెలిసిందే. దీనికి పోటీగా గూగుల్ తో పాటు అనేక టెక్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం అవ్వడం లేదు. ఈ క్రమం లో ఓ కొత్త ఏఐ టూల్ చాట్ జీపీటీకి సవాలు చేయడానికి రెడీ అయ్యింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…. ఇది మీ మనస్సును అర్థం చేసుకొని మీతో మాట్లాడగలుగుతుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100 విభిన్న భాషలలో ఇది మాట్లాడగలుగుతుంది.

Ask QX AI Tool can speak 100 Languages

పైగా దీనిలో మన భారతీయ భాషలు 12 ఉన్నాయి. మనం ఏదైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రతిస్పందిస్తుంది. ఇక దీని పేరు ఏమిటంటే.. ఈ కొత్త ఏఐ టూల్ పేరు ఆస్క్ క్యూఎక్స్(AskQX). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది. క్యూఎక్స్ ల్యాబ్ ఏఐ రూపొందించింది దీన్ని. ఫిబ్రవరీ రెండో తేదీన మ్యాజెస్టిక్ మ్యజియమ్ ఆఫ్ ఫ్యూచర్లో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఏఐ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ
టూల్ అందుబాటులో ఉంటుంది.

త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకు కూడా ఈ టూల్ అందుబాటులో ఉంటుందని కంపనీ ప్రకటించింది. ఇది వచ్చేసి వంద భాషల్లో మాట్లాడుతుంది. ఇది వంద భాషల్లో ప్రతిస్పందిస్తుంది. హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా మొదలు ఇంగ్లీష్‌తో పాటు, ఆస్క్ క్యూఎక్స్ అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, జర్మన్, ఇటాలియన్, కొరియన్ ఇలా రకరకాల ప్రపంచ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. టెక్స్ట్, ఆడియో ఫార్మాట్‌లలో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది ఒప్పుకుంటుంది. 2024 మొదటి త్రైమాసికంలో, వినియోగదారులు ఇమేజ్‌లు, వీడియోలతో ఇంటరాక్ట్ అయ్యేలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూర రానున్నాయి (Ask QX AI Tool).

Join WhatsApp