BoAt Airdopes 91 Earbuds Launched In India

BoAt Airdopes 91: ఇటీవ‌ల కాలంలో ఇయ‌ర్‌బ‌డ్స్ వినియోగం రోజురోజుకు పెరిగిపోయింది. ముఖ్యంగా యువ‌త ఇయ‌ర్‌బ‌డ్స్ ను బాగా వాడుతున్నారు. మీరు కూడా కొత్త ఇయ‌ర్‌బ‌డ్స్ కొనాల‌ని భావిస్తున్నారా..? త‌క్కువ ధ‌ర‌లో నాణ్య‌మైన ఇయ‌ర్‌బ‌డ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా..? అయితే మీకోస‌మే భారతదేశం యొక్క ఫాస్టెస్ గ్రోయింగ్ ఆడియో అండ్ వేర‌బుల్స్ బ్రాండ్ బోట్ తాజాగా డెడ్ చీప్ ధ‌ర‌కే కొత్త TWS ఇయ‌ర్‌బ‌డ్స్ ను లాంచ్ చేసింది. అవే బోట్ ఎయిర్‌డోప్స్ 91(BoAt Airdopes 91).

BoAt Airdopes 91 Earbuds Launched In India

కంపెనీ ఇటీవల లూనార్ ప్రో LTE స్మార్ట్‌వాచ్‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కొత్త ఇయ‌ర్‌బ‌డ్స్ ను దేశంలో ప్ర‌వేశ‌పెట్టింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన వ‌చ్చిన బోట్ ఎయిర్‌డోప్స్ 91 ఇయ‌ర‌బ‌డ్స్ గురించి మ‌రిన్ని వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. బోట్ ఎయిర్‌డోప్స్ 91 ఒక లీనమయ్యే ఆడియో అనుభవం కోసం 10mm డ్రైవర్లను కలిగి ఉంది. మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీతో ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ ఇయర్‌బడ్‌లు డ్యూయల్ మైక్ ENx టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతాయి. అందువ‌ల్ల ఇవి మెరుగైన కాల్ నాణ్యతను అందిస్తాయి. అదనపు సౌలభ్యం కోసం 50ms తక్కువ లేటెన్సీ మోడ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు IPX4 వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంది. అలాగే ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ వైర్‌లెస్ కనెక్షన్‌ల కోసం బ్లూటూత్ v5.3కి స‌పోర్ట్ చేశాయి.(BoAt Airdopes 91)

Also Read: Redmi Note 13 Pro: ఈ రెడ్మీ ఫోన్‌ పై రూ. 4,500 డిస్కౌంట్‌..పూర్తి వివరాలు ఇవే

బోట్ ఎయిర్‌డోప్స్ 91 TWS ఇయర్‌బడ్‌లు మొత్తం 45 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ టైప్-సి కనెక్టర్‌తో ASAP ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 120 నిమిషాల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే.. భారతీయ వినియోగదారులకు బోట్ ఎయిర్‌డోప్స్ 91 ఇయ‌ర్‌బ‌డ్స్ కేవ‌లం రూ. 999 కే అందుబాటులోకి వ‌చ్చాయి. యాక్టివ్ బ్లాక్, మిస్ట్ గ్రే మరియు స్టార్రీ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్స్ ఉంటాయి. అమెజాన్‌ మరియు బోట్‌ యొక్క అధికారిక వెబ్‌సైట్ రెండింటి ద్వారా ఈ TWS ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 1 సంవత్సరం వారంటీ కూడా ల‌భిస్తుంది.

Join WhatsApp