BSNL has increased the validity of these plans

BSNL: ప్రస్తుతం ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ వాడుతున్న సంగతి తెలిసిందే. ఎవరి చేతిలోనైనా లేదా ఎవరి జేబులో చూసినా ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అప్పట్లో ఫోన్ ఉండటమే గొప్ప అనుకుంటే… ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. తక్కువ ధరలో మొబైల్ ఫోన్లు రావడంతో… అందరు కొనేస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ వాడాలంటే కచ్చితంగా సిమ్ ఉండాలి. జియో కంపెనీకి చెందిన సిమ్ మంచి ఆఫర్లు ఇవ్వడంతో… రిలయన్స్ కు చెందిన జియో సిమ్ములు ఎక్కువగా వాడుతున్నారు జనాలు.BSNL

BSNL has increased the validity of these plans

రిలయన్స్ సిమ్ముల తర్వాత ఎయిర్టెల్ సిమ్ చాలామంది వాడేస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కంపెనీకి చెందిన నెట్వర్క్ కూడా చాలామంది వాడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ పై ఉన్న నమ్మకం అలాగే ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చాలామంది ఈ నెట్వర్క్ ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తమ కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. BSNL

Also Read: POCO X6 Neo: బ‌డ్జెట్ ధ‌ర‌లో పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. పూర్తి వివ‌రాలు ఇవే!!

ఈ మధ్యకాలంలో 4 జి నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ విస్తరిస్తోంది. దీనికి తగ్గట్టుగానే యూజర్లను ఆకర్షించేటందుకు ఒక ప్రయత్నిస్తోంది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. అయితే ఈ నేపథ్యంలోనే తమ రీఛార్జి ప్లాన్లకు సంబంధించిన గడువును పెంచేసింది బిఎస్ఎన్ఎల్. 600 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి మొన్నటి వరకు 130 రోజుల వాలిడిటీ వచ్చేది. అయితే ఇప్పుడు 20 రోజులను పెంచేసింది. అంటే 600 రూపాయలతో రీఛార్జ్ చేస్తే మనకు 150 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. BSNL

అంతేకాకుండా 999 రూపాయలతో రీఛార్జి చేస్తే మొన్నటి వరకు 200 రోజులు వచ్చేది. అయితే ఇప్పుడు 250 రోజులకు పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బిఎస్ఎన్ఎల్ కంపెనీ. తక్షణమే ఈ ఆఫర్ను అమలు చేస్తోంది. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల కిందట 99 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే వారికి షాక్ ఇచ్చింది బిఎస్ఎన్ఎల్. 99 రూపాయలతో రీఛార్జి చేసుకున్న వారికి 18 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. అయితే ఆ వ్యాలిడిటీని 17 రోజులకు తగ్గించింది.BSNL

Join WhatsApp