Discover the Luxury of LG QNED Smart TVs

LG QNED: ఈ టీవీ ని చూస్తే మతి పోతుంది. ప్రస్తుతం హై ఎండ్‌ స్మార్ట్‌ టీవీలకు ఆదరణ బాగా పెరిగింది. ఇంట్లోనే హోం థియేటర్‌ కల్చర్‌ వచ్చింది. ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు కూడా పెద్ద స్క్రీన్‌ టీవీ లను కొనడానికి చూస్తూ వుంటున్నారు. పెద్ద స్క్రీన్‌ టీవీ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ మార్కెట్లోకి హై ఎండ్‌ లగ్జరీ స్మార్ట్‌ టీవీ ని లాంచ్‌ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

Discover the Luxury of LG QNED Smart TVs

ఈ టీవీ ధర ఏకంగా రూ. 2 లక్షల పైనే వుంది. మరి అసలు దీనికి ఎందుకు అంత ధర..? ఇంతకీ టీవీ లో ఏముంది..? ఈ వివరాలను చూస్తే… ఈ సిరీస్‌ లో భాగంగా 65 ఇంచెస్‌, 55 ఇంచెస్‌ తో కూడిన రెండు టీవీలను లాంచ్‌ చేయడం జరిగింది. దీని ధర విషయానికొస్తే…. 65 ఇంచెస్‌ టీవీ ధర రూ. 2,19,990కాగా, 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ ధర వచ్చేసి రూ. 1,59,990గా వుంది.

Also Read: Galaxy Z Fold 6: సామ్‌సంగ్‌ నుండి సూపర్ ఫోన్.. బడ్జెట్‌ ధరలోనే ఫోల్డ్ చేసే ఫోన్‌..! 

ఇక ఈ టీవీ ఫీచర్స్ లోకి వచ్చేస్తే… క్వాంటమ్ డాట్, నానోసెల్ అనే ప్రత్యేక టెక్నాలజీని ఇచ్చారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ విజన్, ఆట్మోస్‌తో విజువల్ వండర్‌గా దీన్ని తెచ్చారు. ఎల్‌జీ క్యూఎన్ఈడీ స్మార్ట్‌ టీవీలో 4కే రిజల్యూషన్‌ తో డిస్‌ప్లే తో తీసుకు వచ్చారు. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. గేమ్ డ్యాష్‌బోర్డ్, ఆప్టిమైజర్‌ను సపోర్ట్ చేయడం దీని స్పెషల్. నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రైమ్ విడియో వంటి ఓటీటీ ప్లాంట్‌ఫామ్‌ లకు సపోర్ట్ ఇస్తుంది.(LG QNED)

Discover the Luxury of LG QNED Smart TVs
Join WhatsApp