Tech Tips to Find Mobile Number

Mobile Theft : స్మార్ట్ ఫోన్ స్నాచింగ్ ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతూ వుంది. చాలా మంది ఫోన్లను పోగొట్టుకుంటున్నారు ఫోన్ దొంగలించబడింది అంటే ఏం చేయాలి? ఎలా మళ్లీ ఫోన్ తిరిగి పొందవచ్చు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇలాంటి సంఘటన మీకు తెలిసిన వాళ్ళకైనా లేదంటే మీకైనా ఎప్పుడైనా జరిగితే మీరు ఏం చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా..? ఫోన్ తొంగించబడిన వెంటనే ఏం చేయాలో చూసేద్దాం. ఫోన్ దొంగలించబడిన వెంటనే ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటున్నారా అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లే ముందు కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.

Do this when Mobile Theft

ఫోన్ ని దొంగలించిన వెంటనే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఉన్న ఏదైనా టెలికాం కంపెనీ కస్టమర్ కేర్ కి మీరు వెంటనే కాల్ చేయాలి ఫోన్ దొంగలించబడినట్లైతే అదే కంపెనీ నెంబర్ ఉన్న మరొకరి నుండి ఫోన్ కోసం అడగండి. మీ ఫోన్లో రిలయన్స్ జియో నెంబర్ ఉంటే మీ ఫోన్ దొంగతనానికి గురైన తర్వాత జియో సిమ్ కలిగిన ఇతరుల ఫోన్ ని తీసుకుని కస్టమర్ కేర్ కి కాల్ చేసి, మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ని వారికి చెప్పి మీ మొబైల్ నెంబర్ ని బ్లాక్ చేయాలనుకుంటున్నామని చెప్పండి. కస్టమర్ కేర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

Also read: Amala: అమల చూస్తుండగానే పాడు పని చేసిన నాగార్జున.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..?

ఇలా బ్లాక్ చేయడం వలన మీ సిమ్ దుర్వినియోగం అవ్వదు ఈ పని పూర్తయిన తర్వాత దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన సంఘటన గురించి చెప్పండి. పోలీస్ అధికారి మీ ఎఫ్ఐఆర్ ని నమోదు చేస్తారు. నివేదికలో మీ మొబైల్ నెంబర్ ఫోన్ మోడల్ నెంబర్ ఫోన్ ఏ రంగులో ఉంటుంది ఇటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. మీ IMEI నెంబర్ ని బ్లాక్ చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వలన మీ ఫోన్లో ఇతర కంపెనీల సిమ్ కార్డు పనిచేయదు. మీరు IMEI నెంబర్ ని బ్లాక్ చేయడానికి ఈ లింక్ కి వెళ్లి బ్లాక్ చేయొచ్చు. https://www.ceir.gov.in/Home/index.jsp కి వెళ్లి ఇక్కడ అడిగిన సమాచారాన్ని ఇచ్చేసి మీరు ఈజీగానే బ్లాక్ చేసుకోవచ్చు (Mobile Theft).

Tech Tips to Find Mobile Number
Join WhatsApp