Explore the Samsung Galaxy Z Fold 6 Features and Pricing

Galaxy Z Fold 6: మీరు మంచి ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ ఫోన్ ఫీచర్స్ ని చూడాల్సిందే. Galaxy Z Fold 6 ని తీసుకు వచ్చారు. పూర్తి వివరాలు చూస్తే.. ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 పేరు తో ఇది వరకే ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయడం జరిగింది. గతేడాది ఆగస్టు లో సామ్‌సంగ్‌ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ కొత్త ఫోన్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ ధరను సామ్‌సంగ్‌ రూ. 1,54,999గా పెట్టారు. కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్‌ చేసుకొని ఈ ఫోన్ ని తీసుకు వచ్చారు.

Explore the Samsung Galaxy Z Fold 6 Features and Pricing

తాజాగా బడ్జెట్‌ వేరియంట్‌లో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చే ప్లాన్ లో వున్నారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఫోల్డ్‌ 6 ఫోన్‌ త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు. ఈ ఏడాది మార్కెట్ లోకి రాబోతోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను అందుబాటు ధర లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్‌ ఫోన్‌ మార్కెట్‌ లో మరింత దూసుకెళ్లడమే లక్ష్యంగా సామ్‌సంగ్‌ దీన్ని తెస్తోంది. షావోమీ, హానర్‌, హువాయ్‌ లాంటి కంపెనీలు తక్కువ ధరలోనే ఈ ఫోన్స్ ని తీసుకొచ్చాయి.

Also Read: Tomato: ఒక్క టమాటా తో హై బీపీకి సింపుల్ గా చెక్ పెట్టవచ్చు.. క్లారిటీ ఇచ్చిన నిపుణులు..!

అందుకే సామ్‌సంగ్‌ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ ఏడాది జూలై లోగా ఈ ఫోన్‌ను తీసుకు రానున్నారు. గ్యాలక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 కి 7.6 ఇంచెస్‌తో కూడిన ప్రైమీ డిస్‌ప్లేను ఇచ్చారు. సెకండరీ స్క్రీన్‌ను 6 ఇంచెస్‌తో ఇచ్చారు.ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో ఇది పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ వుంది (Galaxy Z Fold 6).

Join WhatsApp