Flipkart Slashes Rs 13,000 on iPhone 15 Series

iPhone 15 Series: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. మార్కెట్లోకి రకరకాల ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను చాలామంది రేటు ఎంతైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎన్ని స్మార్ట్ ఫోన్ వచ్చిన… ఐఫోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ వాడాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ బ్రాండ్ కు ఉన్న వ్యాల్యూ… ఇంకొక మొబైల్ ఫోన్ కు లేదు.

Flipkart Slashes Rs 13,000 on iPhone 15 Series

అయితే ఈ ఐఫోన్ వ్యాల్యూ… మన ఇండియాలో భారీగా ఉంది. మంచి ఐఫోన్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా 80 వేల వరకు మనం ఖర్చు చేయాల్సిందే. అయితే తాజాగా ఐఫోన్ కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. ముఖ్యంగా ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ మొబైల్ పై 13వేల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేసింది.

Also Read: VI: వీఐ రీఛార్జితో ఫ్రీగా స్విగ్గీ సర్వీసులు..పూర్తి వివరాలు ఇవే!

వాస్తవానికి ఐఫోన్ 15 సిరీస్ 128 జిబి వేరియంట్ మార్కెట్లో 80 వేల రూపాయల వరకు ఉంది. కానీ తాజా ఆఫర్ ప్రకారం…ఐఫోన్ 15 సిరీస్ 128 జిబి వేరియంట్ మొబైల్ ఫోన్ ను 66, 999 రూపాయలకు ఫ్లిప్ కార్ట్ సంస్థ అందిస్తోంది. అంటే ఈ మొబైల్ పై మనం 13 వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు.

ఇక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద మరింత రేటు తగ్గించాల్సి ఉంటుంది. మనం పాత ఐఫోన్స్ లేదా ఇతర స్మార్ట్ ఫోన్లు ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 15… కొనుగోలు చేస్తే ఈ మొబైల్ ఫోన్ మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఐఫోన్ 15 సిరీస్ 128 జిబి వేరియంట్ కొనుగోలు చేసేవారు ఇప్పుడే కొనుగోలు చేసేయండి. (iPhone 15 Series)

Join WhatsApp