Galaxy S23 : ప్రముఖ ఈకామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్ ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ ని అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లపై ఎప్పుడు లేనంతగా భారీ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. గ్యాలక్సీ ఎస్‌23 స్మార్ట్ ఫోన్‌ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

Galaxy S23 phone in discount

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 5జీ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 89,999 ప్రస్తుతం 47 శాతం డిస్కౌంట్‌ తో రూ. 46,999కి కొనుక్కోవచ్చు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఎక్కువ డిస్కౌంట్‌ ని పొందవచ్చు. గరిష్టంగా రూ. 1250 వరకు డిస్కౌంట్‌ ఉంటుంది. ఇలా రూ. 45 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకుంటే గరిష్టంగా రూ. 41,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

Also read; Vivo Y200i: తక్కువ ధరలో అదిరే స్మార్ట్‌ ఫోన్‌..!

గ్యాలక్సీ ఎస్‌23 స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వున్నాయి. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు. క్వాల్కమ్‌ ఆడ్రినో 740 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది ఇది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ , 7680 x 4320 పిక్సెల్స్‌తో కూడిన వీడియోను రికార్డింగ్‌ చేసుకోవచ్చు (Galaxy S23).

Join WhatsApp