Get Upto 57% Off in Samsung Republic Day Sale

Samsung Republic day Sale: 2024 రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తూ క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ కూడా గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అనే ఒక ప్రత్యేక సేల్ ని ప్రకటించింది. దీని కింద ల్యాప్ టాప్ లు, టీవీలు, స్మార్ట్ ఫోన్ లతో సహా పలు సాంసంగ్ ఉత్పత్తులపై ఆఫర్లు అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇకపోతే గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై 57% తగ్గింపును ప్రకటించారు. అయితే ఏ మోడల్స్ పై ఎలాంటి ఆఫర్లు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Get Upto 57% Off in Samsung Republic Day Sale

ప్రస్తుతం సాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ ల ద్వారా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారు 57% తగ్గింపు పొందవచ్చు. అదనంగా హెచ్డిఎఫ్సి , ఐసిఐసిఐ, ఆక్సిస్ తో పాటు ఇతర ప్రముఖ బ్యాంకుల నుండి డెబిట్ అలాగే క్రెడిట్ కార్డుల పై కొనుగోలు చేస్తే రూ.25 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లలో గెలాక్సీ A సీరీస్, M సీరీస్, F సీరీస్, S సీరీస్, Z సీరీస్ లపై మొత్తం 14 స్మార్ట్ ఫోన్లపై 57% వరకు తగ్గింపు పొందవచ్చు అంటే గెలాక్సీ S21 FE, గెలాక్సీ S23 , గెలాక్సీ S23 FE, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫైవ్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: Okkadu: న‌మ్ర‌త చేయాల్సిన ఒక్క‌డు మూవీ భూమిక చేతికి ఎలా వెళ్లింది.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

అంతేకాదు స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి సాంసంగ్ యొక్క ప్రీమియం మరియు జీవనశైలి టీవీ మోడల్ పై కొనుగోలుదారులు ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు 48 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.15,250 వరకు ఆఫర్ లభించనుంది. అంతేకాదు ఎంపిక చేసిన నియో క్యూ ఎల్ఈడి మరియు క్యూ ఎల్ఈడి టీవీ మోడల్ కొనుగోలు చేసిన వినియోగదారులు కింది వాటిలో ఒకదానిలో ఒక ప్రత్యేక బహుమతిని కూడా పొందుతారు. రూ.1,24,990 విలువైన గెలాక్సీ s23 అల్ట్రా, రూ.69,990 విలువైన 50 అంగుళాల సేరిఫ్ టీవీ లేదా రూ.38,990 విలువగల సౌండ్ బార్ ను బహుమతిగా పొందవచ్చు. (Samsung Republic day Sale)

Get Upto 57% Off in Samsung Republic Day Sale
Join WhatsApp