Free up Your Gmail Storage Space with this Simple Step

Gmail: వచ్చే ఆగస్టు ఒకటి నుండి జీమెయిల్ సర్వీస్ లు నిలిచిపోబోతున్నాయా..? ఈ ఏడాది చివరి నాటికల్లా జిమెయిల్ పూర్తిగా కనుమరుగైపోతుందా..? సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల నుండి కూడా దీని మీద ప్రచారం జరుగుతుంది చాలా మంది జిమెయిల్ ని ఉపయోగిస్తూ ఉంటారు జిమెయిల్ ద్వారా ఇతరులకి సందేశాలని పంపిస్తూ ఉంటారు. అఫీషియల్ గా కూడా మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. ఎవరైనా జాబ్ లో సెలెక్ట్ అయితే కూడా కంపెనీ తరఫునుండి అఫీషియల్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇలా జిమెయిల్ మనకి బాగా అలవాటైపోయింది. చాలా వాటి కోసం వాడుతూ ఉంటాము. అయితే మరి ఇటువంటిది జిమెయిల్ సర్వీస్ లో నిజంగానే నిలిచిపోబోతున్నాయా..?

Will Gmail services stops

ఎందుకు అసలు నిలిచిపోబోతున్నాయి..? ఆగస్టు ఒకటిన జీమెయిల్ సర్వీస్ లకి ముగింపు అని సదరు స్క్రీన్ షాట్ లో ఉంది. ఇక అసలు దీనికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.. వచ్చే ఆగస్టు ఒకటిన జిమెయిల్ సర్వీస్ లో నిలిచిపోతున్నాయి అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ యూజర్ల ని ఆందోళన కలిగిస్తోంది. జిమెయిల్ సర్వీస్ కి ఆగస్టు ఒకటిన ముగింపు అని సదరు స్క్రీన్ షాట్ లో ఉంది ఆగస్టు తర్వాత ఈమెయిల్స్ ని పంపించడం స్వీకరించడం సాధ్యపడదని స్టోర్ చేసుకోవడానికి కూడా అవ్వదని ఆ స్క్రీన్ షాట్ లో ఉంది.

Also read: Face: వైట్ ఫేస్ ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫ్రూట్స్ని తప్పనిసరిగా తినండి…!

ఈ స్క్రీన్ షాట్ కొన్ని వేల సంఖ్యలో షేర్ అయింది. అయితే ఈ అనుమానాలు నివృత్తి చేస్తూ సెర్చ ఇంజిన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జిమెయిల్ సర్వీస్ ని నిలిపి వేయమని గూగుల్ చెప్పింది. జిమెయిల్ ఉండడానికి ఉంది అని ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. దీనితో సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న ఊహగానాలకి తెరదింపింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త నిజం కాదని తెలిసింది సో నో వర్రీస్ ఆగస్టు ఒకటి తర్వాత కూడా జిమెయిల్ పని చేస్తుంది కంగారుపడక్కర్లేదు (Gmail).

Free up Your Gmail Storage Space with this Simple Step
Join WhatsApp