Google Maps: ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ కార్లకి డిమాండ్ బాగా పెరిగింది ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే అమ్మకాలు ఊపు అందుకున్నాయి. దీంతో చార్జింగ్ స్టేషన్స్ కోసం వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఈవిస్టేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమస్య రాకుండా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ లో అద్భుతమైన ఫీచర్ ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో చార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గూగుల్ మ్యాప్స్ లో పెట్రోల్ బంకులని ఎలా చూపిస్తుందో ఇకమీదట ఇవి చార్జింగ్ స్టేషన్ లను కూడా అదే విధంగా చూపిస్తుంది.

Google maps new feature to locate EV stations

ఇందుకోసం మ్యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తోంది. దీనిలో భాగంగా ఏఐ సహాయంతో యూజర్ రివ్యూల తో లొకేషన్ మ్యాప్ లో కనబడుతుంది. మీకు దగ్గరలో ఉన్న ఇవి స్టేషన్స్ కి మ్యాప్స్ ని చూపిస్తుంది. ఇవి స్టేషన్లకు సంబంధించి సమాచారంతో పాటుగా ఉపయోగించే యూజర్ల రివ్యూలను కూడా మీరు తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా నచ్చిన చార్జింగ్ స్టేషన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది.

Also read: Pavan Kalyan: కత్తి ఇస్తా.. తప్పు చేస్తే నా తల నరికేయండి…!

ఈ కొత్త ఫీచర్ చాలామంది వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈవీ స్టేషన్లకి సంబంధించి ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. అలానే చార్జింగ్ స్టేషన్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చార్జింగ్ ఎంత టైం పడుతుంది ఇలాంటి వివరాలని రివ్యూ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. తొలుత అమెరికాలో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ సేవల్ని త్వరలోనే భారత్లో కూడా పరిచయం చేయబోతున్నారు. ఈ ఫీచర్ చాలా మందికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈవీ స్టేషన్ల కోసం ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఫీచర్ ఎంతగానో హెల్ప్ అవుతుంది సో ఇకమీదట ఈవీ స్టేషన్ల కోసం ఇబ్బంది పడక్కర్లేదు ఈజీగానే మనం ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు (Google Maps).

Join WhatsApp