Google Pixel 8 The New Era of Google Phones

Google Pixel 8: The New Era of Google Phones

Google Pixel 8: యాపిల్ ఐఫోన్లకు పోటీగా శాంసంగ్ గూగుల్ వంటి టెక్ కంపెనీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ లను తయారు చేస్తూ కస్టమర్లకు అనుగుణంగా అద్భుతమైన టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా గూగుల్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తో పిక్సెల్ సిరీస్ కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో భారీగా సక్సెస్ అయ్యాయి.

ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ని కూడా లాంచ్ చేసింది. ప్రస్తుతం మన భారతదేశంలో వీటి అమ్మకాలు అక్టోబర్ 12 అనగా నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. ఇక వీటిని ఎక్కడ కొనుగోలు చేయాలి? ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి? ఇలా ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

Also Read: Samsung Galaxy Tab S8 : ఈ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ.20 వేలకిపైగా తగ్గింపు..!

గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ 6.2 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేటుతో 428 ppi పిక్సెల్ డెన్సిటీ ఈ స్క్రీన్ యొక్క ప్రత్యేకత ముందు వెనుక వైపు మార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. పిక్సెల్ ఎయిట్ ఫోన్లో టెన్సర్ G3 ప్రాసెసర్ తో వస్తుంది. పాత టెన్సర్ G2 తో పోలిస్తే కొత్త ప్రాసెసర్ మంచి స్పీడు ఎఫిషియన్సీని కూడా అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. 50 మెగాపిక్సల్ పిడి వైడ్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం 10.5MP సెల్ఫీ కెమెరా అమర్చబడింది. 4,575 mah బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 21 వరకు అప్డేట్ అవుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8జిబి ర్యామ్ , 256 GB వరకు స్టోరేజ్ ఆప్షన్ తో లభిస్తుంది. మొత్తానికి అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉంది.(Google Pixel 8)

Join WhatsApp