Latest Security Update for Samsung Mobiles 2

Holi 2024: ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తారు. అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనవసరంగా ఫోన్ పాడైపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. హోలీ పండుగ నాడు అందరూ రంగులతో ఆడుకుంటూ ఉంటారు అలానే హోలీ పండుగ సంబరాల్లో మునిగిపోయి చాలా విషయాలు ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మన ఫోన్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది హోలీ కారణంగా ఫోన్ పాడైపోతే తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫోన్లో ముఖ్యమైన వాటిని వాడుకోవడానికి అవ్వదు. పైగా డబ్బులు కూడా మీకే నష్టం. హోలీ రంగులతో ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ విషయంలో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి ఇలా జాగ్రత్తలు కనుక తీసుకున్నారంటే మీ ఫోన్ కి ఎలాంటి నష్టం వాటిల్లదు. మీ సమీపంలోని అన్ని దుకాణంలో జిప్ లాక్ బ్యాగులు దొరుకుతాయి వాటిని కొనుక్కొని స్మార్ట్ ఫోన్లు పెట్టండి. అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందులో పెట్టుకుని దాచుకోండి హోలీ సందర్భంగా ఎవరైనా రంగులు చల్లినా నీళ్లు పోసినా తడిసిపోకుండా ఉంటుంది.

Holi 2024 smart phone tips

ఫోను, మీ ఫోన్ ఇయర్ బడ్స్ తదితర వాటికి జిప్ లాక్ రక్షణ లభిస్తుంది దుమ్ము దూళి వంటి వాటిని చేరకుండా చూస్తుంది. అలానే మీ ఫోన్ అన్లాక్ చేసే విధానాన్ని మార్చండి బయోమెట్రిక్ ఫేస్ లాక్ కి బదులుగా పిన్ నెంబర్ ని సెట్ చేసేలా చూసుకోండి ముఖం నిండా రంగులు వున్నా చేతికి రంగులు ఉన్నా ఫోన్ వాడడానికి అవ్వదు. అత్యవసర సమయంలో ఫోన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలానే ఫోన్ కి ఉన్న పోర్ట్స్, ఇయర్ పీస్ తదితర వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి నీరు రంగులు లోపలికి వెళ్ళిపోతాయి వాటిని నిరోధించడానికి వాటి మీద టేప్ ని అతికించండి. టేప్ ని అప్లై చేసిన తర్వాత స్పీకర్లు పాడైపోకుండా ఉండడానికి ఫోన్ ని వైబ్రేషన్ మోడ్ లో పెట్టండి.

Also read: Health: కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. డాక్టర్ పని లేకుండా ఈ సింపుల్ టిప్స్ తో విముక్తి పొందండి..!

ఫోన్ తడిగా ఉన్నప్పుడు నీటిలో మునిగిపోయినప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నం చెయ్యద్దు. ఫోన్ పూర్తిగా ఆరే వరకు ఎదురు చూడండి తడిసిన ఫోన్ని ఆరబెట్టడానికి హెయిర్ డ్రాయర్ బ్లో డ్రైయ్యింగ్ వంటి వాటిని వాడొద్దు ఇలా చేయడం వలన ఆమె ఫోన్స్ లో సెన్సిటివ్ పార్ట్స్ దెబ్బతింటాయి నోటితో వేగంగా ఊదడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది హోలీ ఆడేటప్పుడు పవర్ బ్యాంకు వంటి వాటిని తీసుకెళ్లొద్దు నీళ్లు పడితే పాడైపోతాయి కొత్త ఫోన్లో ఐపీ రేటింగ్ టెక్నాలజీ ఉంది దుమ్ము నుండి ఫోన్ రక్షిస్తుంది కంపెనీలు ఈ విషయాన్ని చెప్తున్నాయి అయినా నష్టాన్ని కవర్ చేయడానికి నిబంధనలు ఉంటాయి వారంటీ కింద నీటి నష్టాన్ని ఏ కంపెనీ భరించదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి (Holi 2024).

Latest Security Update for Samsung Mobiles 2
Join WhatsApp