Honor Magic 6 pro: New Phone From Honor

Honor Magic 6 pro: ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి మొబైల్ కంపెనీలన్నిటిలో హానర్ కంపెనీ మంచి గుర్తింపుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక రకాల మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే తరుణంలో హానర్ నుంచి హానర్ మ్యాజిక్ 6 ప్రో అనే మొబైల్ అందుబాటులోకి రానుంది. దీనిని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఎక్స్పోలో ప్రారంభించనున్నారు. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూద్దామా.. హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది.

Honor Magic 6 pro: New Phone From Honor

ఈ మొబైల్ ప్రత్యేకమైనటువంటి ఐ ట్రాకింగ్ ఏఐ ఫంక్షన్ ను అందిస్తోంది. ఈ మొబైల్ ద్వారా ఏదైనా కారుకు రిమోట్ గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డోర్ లాక్ చేయడం, తెరవడం, స్టార్ట్ చేయడం వంటి టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ డిస్ప్లే నానో క్రిస్టల్ షీల్డ్ ద్వారా కవర్ చేయబడింది. దీని యొక్క గ్లాస్ పై సిలికాన్ నైట్రేట్ కోటింగ్ కూడా ఉంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో అనేది ఒక హై హేండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్. ఇది గతంలో విడుదల చేయబడినటువంటి మ్యాజిక్ V2 యొక్క ప్రీమియం అవతారంగా చెబుతున్నారు. (Honor Magic 6 pro)

Also Read: Xiaomi 14 Series: షావోమీ 14 సిరీస్ ఫోన్లు వ‌చ్చేశాయి.. స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర వివ‌రాలు మీకోసం!

అంతేకాకుండా ఈ మొబైల్ లో అద్భుతమైన కెమెరా సెట్ అప్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే 50 మెగాపిక్సల్ ప్రైమరీ, కెమెరా 50 మెగా పిక్సెల్ ఆల్ట్రో వైడ్ కెమెరా, 180 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు,2.5× ఆర్టికల్ జాం సామర్థ్యం ఉన్నాయి. ఈ యొక్క మొబైల్ దుమ్ము, ధూళి నీరు, నిరోధకత కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది. మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో సిలికాన్ కార్బన్ టెక్ ఉపయోగించారు. అంతేకాకుండా విపరీతమైన చలిలో కూడా చార్జ్ చేయడానికి తక్కువ సామర్థ్యంతో ఎక్కువ విద్యుత్ నిలువ చేయడానికి వీలవుతుంది.

Honor Magic 6 pro: New Phone From Honor

ఇక ఈ మొబైల్ కలర్ విషయానికి వస్తే పోర్చే అగెట్ గ్రే కలర్ లో ఉంది. స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 120Hz రిఫ్రెష్ రేట్, 6.8 అంగుళాల ఎల్టిపిఓ AMOLED డిస్ప్లే, 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, అంతేకాకుండా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8GEN 3 ప్రాసెసర్ కలిగి ఉంది. అలాగే వెనుక వైపు 50 ఎంపీ+ 50 ఎంపీ+ 180 ఎంపీ డ్యూయల్ కెమెరా సెట్ అప్, ముందు భాగంలో 50mp సెల్ఫీ షూటర్ కలిగి ఉండడమే కాకుండా 568 బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ:1,16,500 ఉంటుందని అంచనా వేస్తున్నారు.(Honor Magic 6 pro)

Join WhatsApp