Honor Pad 9: If you buy this tablet..Bluetooth keyboard is free

Honor Pad 9: Honor కంపెనీ నుంచి సరికొత్త టాబ్లెట్ రిలీజ్ అయింది. ఈ యొక్క టాబ్లెట్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రకటించారు. హెచ్ టెక్ టాబ్లెట్ యొక్క ఇండియా లాంచ్ ను ప్రారంభించింది. ఈ టాబ్లెట్ గురించి హైటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఖండేల్వాల్ కంపెనీ ప్యాడ్ హానర్ పాడ్ 9 కొంటే దానికి సంబంధించిన బ్లూటూత్, కీబోర్డు ఉచితంగా అందజేస్తామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Honor Pad 9: If you buy this tablet..Bluetooth keyboard is free

ఇక హానర్ పాడ్ 9 ప్రత్యేకతల విషయానికి వస్తే..6.96mm మందం కేవలం 555g బరువు కలిగి ఉంది. అంతేకాకుండా 12.1 అంగుళాల 2.5k LCD స్క్రీన్ ప్యాక్ చేస్తున్నది. ఈ యొక్క ట్యాబ్లెట్ స్నాప్ డ్రాగన్ 6th జనరేషన్ 1SOC ద్వారా శక్తిని పొందుతున్నది. అంతేకాకుండా 8300 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్టుతో, 35W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. (Honor Pad 9)

Also Read: Smart watch: కళ్లు చెదిరే ఫీచర్లతో స్మార్ట్‌ వాచ్‌లు.. ధర కూడా తక్కువే..!

అమెజాన్ లో ఈ టాబ్లెట్ యొక్క పేజీలో దీనికి సంబంధించినటువంటి చిత్రం హైలెట్ అవుతోంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్ టియువి రైన్ ల్యాండ్ లో బ్లూ లైట్ మరియు టియువి రైన్ ల్యాండ్ ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్ పొందినది. అంతేకాకుండా ఇండియన్ వేరియంట్ లో 8+256GB కాన్ఫిగరేషన్ తో గ్లోబల్ యూనిట్ల మాదిరిగానే, 8GB వర్చువల్ ర్యామ్, మద్దతుతో వస్తోంది.

Honor Pad 9: If you buy this tablet..Bluetooth keyboard is free

అంతేకాకుండా హానర్ ప్యాడ్ 9 ఆండ్రాయిడ్ 13 ఆధారంగా హానర్ యొక్క మ్యాజిక్ ఓఎస్ 7.2ని కలిగి ఉంది. ఇక ఈ టాబ్లెట్ స్మార్ట్ కనెక్టివిటీ, అద్భుతమైన పనితీరుతో దూసుకుపోతోంది. అలాగే డ్యూయల్ మైక్రోఫోన్లు వాయిస్ మెరుగుదల కోసం ఆల్గారితములతో 8 స్పీకర్ సెటప్ ప్యాక్ చేస్తోంది. అయితే ఈ హనర్ ట్యాబ్ అధికారిక లాంచ్ మరికొద్ది రోజుల్లో అవ్వనుంది.(Honor Pad 9)

Join WhatsApp