HONOR X9B Features with the Latest Technology

HONOR X9B: ప్రస్తుత భారత మార్కెట్ లో అనేక మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే తరుణంలో హానర్ కంపెనీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధించింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హానర్ x9 బి ఇండియన్ మార్కెట్ లో త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ విడుదలవ్వకముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫిబ్రవరి 15వ తేదీన హానర్ x9b ఫోన్ లాంచ్ చేయబడింది.

HONOR X9B Features with the Latest Technology

ఈ మొబైల్ లో ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో భారత్ మొట్టమొదటి ఆల్ట్రా బౌన్స్ డిస్ప్లే ఉంటుందని కంపెనీ తెలియజేసింది. అంతేకాకుండా ఈ మొబైల్ ఎస్ జి ఎస్ వెరిఫైడ్ 360 డిగ్రీ మొత్తం డివైస్ ప్రొటెక్షన్ అందిస్తుందని గ్లోబల్ లిస్టింగ్ చెబుతోంది. అలాగే ఈ ఫోన్ ఆల్ట్రా బ్రౌన్సు యాంటీ డ్రాప్ డిస్ప్లే , 31 ప్రొటెక్షన్ సిస్టంతో స్క్రీన్ ఇంటర్నల్ పార్ట్ ప్రేమ్ కోసం ప్రత్యేక లేయర్లు ఉంటాయట.

Also Read: Redmi Note 13 Pro: ఈ రెడ్మీ ఫోన్‌ పై రూ. 4,500 డిస్కౌంట్‌..పూర్తి వివరాలు ఇవే

అలాగే ఈ మొబైల్ 12gb ప్లస్ 256gb ఆప్షన్ లలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ పై అనేక ఆఫర్లు కూడా రానున్నాయట. ఈ మొబైల్ కు 12 నెలల స్క్రీన్ బ్యాక్ కవర్ ప్రొటెక్షన్, అలాగే 20 నెలల వరకు బ్యాటరీ వారంటీ కలిగి ఉందని తెలుస్తోంది. ఇక హానర్ x9b ధర విషయానికి వస్తే ఎక్స్ ట్రూ వైర్లెస్ ఇయర్ బర్డ్స్, కలిపి రూ:35వేల లోపు ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

అలాగే ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించరున్నాయి. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.78 అంగుళాల 1.5k అమోలేడ్ స్క్రీన్ , 108ఎంపీ త్రిపుల్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ లో 2 ఎంపీ మాక్రో షూటర్ తో కూడిన ఆల్ట్రా వైడ్ లెన్స్, 5ఎంపీ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్, హానర్ 35w వైల్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mah బ్యాటరీ కలిగి ఉండబోతోంది. (HONOR X9B)

Join WhatsApp