Huawei Free Buds 4E with amazing battery

Huawei Free Buds 4E: ఇయర్ బడ్స్ ప్రస్తుత కాలంలో మనం ఎవరి చెవిలో చూసిన రకరకాల మోడల్స్ లో అద్భుతమైన కలర్స్ లో ఇయర్ బడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి వైర్ లేకుండా బ్లూటూత్ సహాయంతో అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ఉండేటువంటి ఇయర్ బడ్స్ లో అనేక కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హువాయి . ఈ కంపెనీ నుంచి free buds 4E అనే ఇయర్ బడ్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి.

Huawei Free Buds 4E with amazing battery

ఇప్పటికే ఈ కంపెనీ నుంచి ఇయర్ బడ్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి కానీ ఫ్రీ 4E అనేది సరికొత్త అప్డేట్ తో మన ముందుకు తీసుకువచ్చారు. ఈ కొత్త మోడల్ లో బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుందట. దీని యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూసేద్దామా. Free buds 4E 14.3mm డైనమిక్ డ్రైవర్, 40Khz ఫ్రీక్వెన్సీ సెమీ ఓపెన్ స్టైల్ డిజైన్ కలిగి ఉన్నాయి. (Huawei Free Buds 4E)

Also Read: Best Gaming Phones: గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్..!

ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2.0 సాంకేతికత కలిగి ఉండడమే కాకుండా , కాల్స్, పాటలు వినడానికి అద్భుతమైన ఆడియో క్వాలిటీ కలిగి ఉంటుందట. ఈ యొక్క ఫ్రీ బడ్స్ యాక్టివ్ నాయిస్ తగ్గింపు ఆన్ లో ఉన్నప్పటికీ,కేస్ 17 గంటల వినియోగాన్ని అందిస్తుందట. యొక్క ఇయర్ ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేయడానికి కేవలం 40నిముషాల సమయం సరిపోతుంది.

Huawei Free Buds 4E with amazing battery

అంతేకాకుండా బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఏకకాలంలో రెండు పరికరాలతో జత చేయవచ్చు. Ip 64 డస్ట్ మరియు వాటర్ అసిస్టెంట్ రేటింగ్ గురించి ఇంకా రివీల్ చేయలేదు. ఈ యొక్క ఫ్రీ బడ్స్ 4ఈ 2024 అనేది మూడు రంగులలో లభిస్తుందట. ఇందులో సిరామిక్, ఫాస్ట్ సిల్వర్, వైట్ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వీటి ధర విషయానికొస్తే చైనాలో 699 యువాన్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.(Huawei Free Buds 4E)

Join WhatsApp