Huge Discount on Moto G54 5G in India

Moto G54 5G: ప్ర‌ముఖ టెక్ సంస్థ మోటరోలా నుంచి ప్ర‌తి ఏడాది ఎన్నో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అలా ఇటీవ‌ల ప్రారంభించ‌బ‌డిన క్రేజీ స్మార్ట్‌ఫోన్ మోటో జీ54 5జీ(Moto G54 5G). భారతదేశంలో గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే తాజాగా కంపెనీ ఈ జీ-సిరీస్ మొబైల్ పై భారీ డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. ధ‌ర‌ను ఏకంగా రూ. 3,000 వరకు తగ్గించింది. మ‌రి ఇంకెందుకు లేటు మోటో జీ54 5జీ యొక్క ఇప్ప‌టి ధ‌ర‌లు మ‌రియు స్పెసిఫికేష‌న్స్ పై ఓ లుక్కేసేయండి.

Huge Discount on Moto G54 5G in India

మోటో జీ54 5జీ రెండు వేరియెంట్స్ లో అందుబాటులోకి వ‌చ్చింది. బేస్ మోడ‌ల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 15,999 తో ప్రారంభం కాగా.. ఇప్పుడు రూ. 13,999కే ల‌భ్య‌మ‌వుతోంది. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధ‌ర రూ. 18,999 కాగా.. ప్ర‌స్తుతం రూ. 15,999కే వ‌స్తోంది. మోటో జీ54 5జీ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను క‌లిగి ఉంది.

ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC ప్రాసెస‌ర్ ను ఈ హ్యాండ్‌సెట్ లో అమ‌ర్చారు. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను ఈ ప‌రిక‌రంలో అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మ‌రియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను ఇచ్చారు.(Moto G54 5G)

Also Read: Noise ColorFit Hexa: ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో నాయిస్ నుంచి వ‌చ్చిన మ‌రో కొత్త స్మార్ట్‌వాచ్.. వివ‌రాలు ఇవే!

మోటో జీ54 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 13లో My UX 5.0తో నడుస్తుంది. 12 జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 256 జీబీ వ‌ర‌కు స్టోరేజ్ ను ప్యాక్ చేస్తుంది. ఆన్‌బోర్డ్ స్టోరేజీని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ IP52-రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది. 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ మ‌ద్ద‌తులో 6,000mAh బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు అనేక క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Join WhatsApp