Huge Discount On Xiaomi Redmi Note 13 Pro

Redmi Note 13 Pro: మన ఇండియాలో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొబైల్ ఫోన్స్ పై రకరకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆఫర్లు లేనిదే జనాలు మొబైల్ ఫోన్స్ కొనడం లేదు. దీంతో మొబైల్ కంపెనీలు అలాగే ఈ-కామర్స్ కంపెనీలో రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెడ్ మీ నోట్ 13 ప్రో మొబైల్ ఫోన్ పై బంపర్ ఆఫర్ ప్రకటించాయి ఈ కామర్ సంస్థలు.

Huge Discount On Xiaomi Redmi Note 13 Pro

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ ఆఫర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ లో భాగంగా… స్మార్ట్ ఫోన్స్ పై భారీ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ ఫోన్ పై మనకు 4500 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అయితే దీనిపై కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఈ రెడ్మీ మొబైల్ 25 వేల రూపాయల వరకు ఉంది.

Also Read: Tecno Spark 20: Tecno Spark 20 మొబైల్స్ పై భారీ డిస్కౌంట్.. వివరాలు ఇవే

ఫ్లిప్కార్ట్ ప్రకారం రెడ్మి నోట్ 13 ప్రో 8gb, 128 gb మొబైల్ ధర 25, 999 రూపాయలుగా ఉంది. ఇక స్టోరేజ్ మరియు ర్యామ్ పెరిగిన కొద్దీ ధర పెరుగుతోంది. అయితే…రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ ను ఎస్బిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మనకు 2000 రూపాయల ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే మొబైల్ ఎక్స్చేంజ్ చేసినవారికి 2500 రూపాయలు ఆఫర్ కూడా మనకు లభిస్తుంది. ఇక కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ కింద 700 రూపాయల 12 నెలల ప్రీమియం కూడా లభిస్తుంది. ఇక మనం వాడే కార్డులపై ఏదైనా డిస్కౌంట్ ఉంటే… ఈ మొబైల్ ఫోన్ ద్వారా మరింత దగ్గర ఛాన్స్ ఉంటుంది. (Redmi Note 13 Pro)

Join WhatsApp