Huge Price Discount On Realme Narzo 60 Pro

Realme Narzo 60 Pro: మంచి కెమెరా ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? అయితే మీకు ఇదే మంచి స‌మ‌యం. గ‌త ఏడాది ఇండ‌య‌న్ మార్కెట్ లో విడుద‌లై భారీ ప్ర‌జాదార‌ణ అందుకున్న రియ‌ల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ధ‌ర తాజాగా అమెజాన్ లో భారీ త‌గ్గింపును సొంతం చేసుకుంది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు మ‌రియు 100 మెగాపిక్సెల్ కామెరాను క‌లిగి ఉన్న ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు మ‌రింత త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రియ‌ల్ మీ నార్జో 60 ప్రోలో రెండు వేరియంట్స్ ఉన్నాయి.

Huge Price Discount On Realme Narzo 60 Pro

అందులో 8GB ర్యామ్‌+128GB స్టోరేజీ వేరియంట్ అస‌లు ధ‌ర రూ. 26,999 కాగా.. ప్ర‌స్తుతం రూ. 23999 కే ల‌భిస్తోంది. అద‌నంగా ప‌లు బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తక్షణ తగ్గింపును పొందుతారు. నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాలను కూడా ల‌భిస్తాయి. అలాగే రియ‌ల్ మీ నార్జో 60 ప్రోలో 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్ అస‌లు ధర రూ. 28,999 ఉంటే.. ఇప్పుడు రూ.26,999కే అందుబాటులోకి వ‌చ్చింది.

అద‌నంగా కూపన్‌ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.4000 తగ్గింపు ల‌భిస్తుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్‌ ఈఎంఐ ప్రయోజనాలకు కూడా పొందుతారు. ఇక రియ‌ల్ మీ నార్జో 60 ప్రో యొక్క స్పెసిఫికేష‌న్స్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. ఈ 5జీ మొబైల్ 2023 జూలై 6న ఇండియాలో ప్రారంభించబడింది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. రియ‌ల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.(Realme Narzo 60 Pro)

Also Read: Apple: త్వరలో యాపిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు..ధర, ఫీచర్స్ ఇవే!

అలాగే ఆండ్రాయిడ్ 13పై ర‌న్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. వెనుకవైపు 100-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెకండ‌రీ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఉంటుంది. 16-మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్‌ సెన్సార్ ఉంటుంది. 5000mAh సామ‌ర్థ్యం గ‌ల నాన్-రిమూవబుల్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది 67W టర్బో ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Join WhatsApp