Infinix Smart 8 Pro unveiled with a 50MP camera and 5,000 mAh battery

Infinix Smart 8 Pro: మన ఇండియా మొబైల్ ఫోన్లకు పెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి ఫోన్ లాంచ్ చేసిన మన ఇండియాలో త్వరగా విక్రయాలు జరుపుకుంటుంది. మంచి ఫీచర్స్ అలాగే తక్కువ ధరలో ఉన్న మొబైల్ ఫోన్స్ త్వరగా విక్రయాలు జరుగుతాయి. ఇక ఇదే అదనగా చాలా కంపెనీలు రకరకాల మొబైల్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి.

Infinix Smart 8 Pro unveiled with a 50MP camera and 5,000 mAh battery

ఇక తాజాగా దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఇన్ఫినిక్స్ అదిరిపోయే మొబైల్ ఫోన్ను ఆవిష్కరించింది. Smart 8 Pro పేరుతో ఇన్ఫినిక్స్ సరికొత్త మొబైల్ ఫోన్ ను తీసుకురాబోతుంది. అయితే దీని ధర రూ.7450 ఉంటుందట. అతి త్వరలోనే వెబ్సైట్ లో అధికారికంగా ధర వివరాలు వెల్లడించనుంది కంపెనీ. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం తాజాగా వివరించింది ఇన్ఫినిక్స్ కంపెనీ.

Also Read: iPhone 15 Series: కొత్త ఐఫోన్-15పై… 13 వేల రూపాయల డిస్కౌంట్..వివరాలు ఇవే

ఇన్ఫినిక్స్ రిలీజ్ చేసిన సరికొత్త మొబైల్ ఫోన్ లో…4gb+ 64 ram, 8gb + 128 gb స్టోరేజ్ ఉన్న మోడల్స్ ఉన్నాయి. ఇక ఈ మొబైలు సైజు 6.66 అంగుళాలు ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ కూడా మనకు అందిస్తున్నారు. ఇక దీని రిఫ్రెష్ రేటు 90 HZ గా నిర్ణయించారు.

అంతేకాకుండా ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ ఫోన్కు మంచి కెమెరా సెట్ అప్ కూడా ఉంది. ఈ మొబైల్ బ్యాక్ కెమెరా 50 mega pixels ఉంటుందని కంపెనీ. అలాగే ఏఐ లెన్స్ లో కూడా అమర్చారు. ఫ్రంట్ కెమెరా ఎనిమిది మెగాపిక్సల్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి…5000mah గా ఉంది. (Infinix Smart 8 Pro)

Join WhatsApp