Instagram Adds Message Editing, Fix Mistakes Within 15 Minutes

Instagram : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ని వాడుతున్నారు. ఇంస్టాగ్రామ్ ని వాడే వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వుంది. కొత్త ఫీచర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ చేస్తుంటే కొత్త కొత్త ఫీచర్ల ని ఉపయోగించుకోవడానికి అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో వచ్చే కొత్త ఫీచర్లు వినియోగదారులు బాగా ఆకట్టుకుంటాయి పైగా కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ని కూడా తీసుకు వస్తూ ఉంటుంది ఇంస్టాగ్రామ్ లో అసభ్యకరమైన కంటెంట్ కి కూడా కొదవలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీడియోలు ఫోటోల రూపంలో పలువురు కొన్ని రకాల కంటెంట్లని పెడుతూ ఉంటారు.

Instagram new feature

అయితే ఇటువంటి కంటెంట్లని టీనేజర్లకి చూపించకూడదు అనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చే పనిలో పడింది. టీనేజ్ లో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఫోటోలు వీడియోలు అసభ్యకరమైనవి హానికరమైనవి కనిపించకుండా చేయడానికి మెషిన్ లెర్నింగ్ ని కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తుంది. నగ్నత్వంలో కూడిన ఫోటోలను పంపడానికి ఎవరైనా ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి అని యూజర్లకి ఒక వార్నింగ్ అలెర్ట్ అనేది వస్తుంది. డివైస్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి కంటెంట్లని విశ్లేషిస్తుంది.

Also read: Venkatesh: వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ఘోరంగా మండిపడ్డ జానీ మాస్టర్… కొట్టేందుకు కూడా సిద్ధపడ్డాడుగా..!

ఇదిలా ఉంటే ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఇలాంటి కంటెంట్ పెరుగుతూ ఉండడంతో యువత కూడా ఎక్కువగా అటువంటి కంటెంట్ కి అట్ట్రాక్ట్ అవుతుందని యునైటెడ్ స్టేట్స్ యూరప్ లో ప్రజల నుండి విమర్శలు వచ్చాయి. అయితే ఇటువంటి కంటెంట్ కి అడ్డుకట్ట వేయడానికి ట్రై చేస్తోంది. 18 ఏళ్లలోపు యూజర్లకు ఈ ఫీచర్ ఆటోమేటిక్ కి ఆన్ అవుతుందని దీంతో పాటుగా సమీకరణ కంటెంట్ ని చూడకుండా ఆపవచ్చని చెప్పింది. 18 ఏళ్ల నిండిన వాళ్ళు ఈ ఫీచర్ ని మాన్యువల్ గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది ఈ ఫీచర్ కనుక ఒకసారి అందుబాటులోకి వచ్చిందంటే టీనేజర్లకి కొన్ని రకాల కంటెంట్లు కనిపించకుండా ఉంటాయి (Instagram).

Instagram Adds Message Editing, Fix Mistakes Within 15 Minutes
Join WhatsApp