iPhone 14 Plus can be bought under Rs 50,000 on Flipkart

iPhone 14 Plus: ఐఫోన్ కొనాల‌ని భావిస్తున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. ఐఫోన్ 14 ప్ల‌స్ ఇప్పుడు డెడ్ చీప్ ధ‌ర‌కే ల‌భిస్తోంది. అవును 2022లో ప్రారంభించబడిన ఐఫోన్ 14 ప్ల‌స్ 128GB వేరియంట్‌ ప్రస్తుతం ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో సాటిలేని ధరకు అందించబడుతోంది. ఆపిల్ సంస్థ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డీల్ ను పాస్ చేసింది. ఐఫోన్ 14 ప్లస్‌ అసలు ధర రూ. 79,900. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 16శాతం గణనీయమైన తగ్గింపుతో ప్రదర్శించబడుతుంది.

iPhone 14 Plus can be bought under Rs 50,000 on Flipkart

క‌స్ట‌మ‌ర్స్ కు ఈ హ్యాండ్‌సెట్ రూ.66,999కే అందుబాటులోకి వ‌చ్చింది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. తమ పాత ఐఫోన్ 13 మినీని మంచి కండీష‌న్ లో ట్రేడింగ్ చేయాలనే ఆసక్తి ఉన్న కస్టమర్‌లకు ఫ్లిప్‌కార్ట్ రూ. 23,000 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఐఫోన్ 14 ప్ల‌స్ ను రూ. 44,297 ధరతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ల‌వ‌ర్స్ కు ఇది తిరుగులేని డీల్ అనే చెప్పుకోవ‌చ్చు.

ఐఫోన్ 14 ప్ల‌స్ స్పెసిఫికేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్ డిజైన్ తో ఇది వ‌స్తుంది. ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌తో అందించ‌బ‌డుతుంది. అలాగే ఈ ప‌రిక‌రంలో డ్యూయ‌ర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. ఇది 12-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో అమర్చబడి ఉంటుంది.(iPhone 14 Plus)

Also Read: Lava O2: 5000ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ, డ్యూయ‌ర్ కెమెరాతో లావా O2 లాంచ్‌.. ధ‌ర రూ. 10 వేల క‌న్నా త‌క్కువే!

ఇది అసాధారణమైన ఫోటో మరియు వీడియో నాణ్యతను భరోసా ఇస్తుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12-మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను ఇచ్చారు. ఐఫోన్ 14 ప్లస్ లో iOS ముందే ఇన్‌స్టాల్ చేయబడినందున‌.. వినియోగదారులకు మృదువైన మరియు స్పష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. మ‌రి త‌క్కువ ధ‌రలో ఐఫోన్ కొనాల‌నుకుంటే ఈ ఆఫ‌ర్ ను అస్స‌లు మిస్ అవ్వ‌కండి.

Join WhatsApp