iPhone New Security Feature

iPhone: ఈరోజుల్లో ప్రతీ ఒకరు కూడా స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగంలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది ఇలా ఉంటే, యాపిల్‌ తన స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కి ఒక గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. అయితే ఈ ఫీచర్ భద్రత కోసం అని తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. యాపిల్‌ తన స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రైవసీకి పెద్ద పీట వేసే యాపిల్‌ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ ని ప్రవేశపెట్టింది. ఎప్పుడైనా ఎవరైన దొంగలు ఫోన్‌ ని దొంగిలిస్తే.. అందులోని సమాచారం అంతా తెలిసిపోతుందనే భయం అందరికీ కూడా ఉంటుంది.

iPhone New Security Feature

అందుకనే పాస్‌వర్డ్‌, స్క్రీన్‌ ప్యాట్రన్‌ లను పెట్టుకుంటుంటారు. ఒకవేళ పాస్‌వర్డ్‌ తెలిసి పోయినా ఫోన్‌ ని ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ సమస్య ని తీర్చడానికే యాపిల్‌ కొత్త ప్రైవసీ ఫీచర్‌ ని ఒకటి తీసుకు వచ్చింది. దీనిలో భాగంగానే ‘స్టోలెన్ డివైజ్‌ ప్రొటెక్షన్‌’ అనే ఫీచర్‌ ని తీసుకొచ్చింది. ఐఫోన్‌ తో పాటు ఐప్యాడ్‌ లో కూడా ఈ ఫీచర్‌ ని తీసుకు వచ్చింది.

Also Read: EV Production: బడ్జెట్‌లో EVల తయారీకి బూస్టింగ్‌ ఇస్తారా..?

పాస్‌వర్డ్‌ తెలిసి ఫోన్‌ ని దొంగలించినా ఆపరేట్ చేయలరు. రెగ్యులర్‌ గా వెళ్లే ప్రదేశాలకు కాకుండా ఇంకేమైనా ప్రదేశాల్లో ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తే వెంటనే స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌ యాక్టివేట్ అయిపోతుంది. ఫోన్‌ లేదా ఐప్యాడ్‌కు అదనం సెక్యూరిటీ యాడ్‌ అవుతుంది. తర్వాత డివైజ్‌ ని యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఫేస్‌ ఐడీని అందించాల్సి ఉంటుంది. (iPhone)

Join WhatsApp