iQOO Neo 9 Pro India Launch Date Details Here

iQOO Neo 9 Pro: వివో సబ్-బ్రాండ్ ఐకూ నుంచి త్వ‌ర‌లోనే ఇండియాలో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే ఐకూ నియో 9 ప్రో(iQOO Neo 9 Pro). ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 22న లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. తాజాగా దీనిపై అధికార ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఐకూ నియో 9 ప్రో గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో చైనాలో ప్రారంభించ‌బ‌డింది. ఇప్పుడు ఇండియాన్ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ పనితీరు, డిజైన్ మరియు ఇమేజింగ్‌తో సహా అన్ని కీలక విభాగాలలో మెరుగుదలలను తీసుకువస్తుందని ఐకూ ఒక ప్రకటనలో తెలిపింది.

iQOO Neo 9 Pro India Launch Date Details Here

అలాగే లాంచ్ కు కొన్ని వారాల ముందే పరికరం యొక్క కీలక వివరాలను టీజ్ చేస్తోంది. ఐకూ నియో 9 ప్రో అమెజాన్ ఇండియా మరియు iQOO ఇ-స్టోర్‌లో 8 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ మరియు 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులోకి రాబోతుంద‌ని కంపెనీ ప్రకటించింది. ఫైరీ రెడ్ మరియు కాంకరర్ బ్లాక్ కలర్స్‌లో వ‌స్తుంది. ఫైరీ రెడ్ వేరియంట్ లెదర్ ఫినిషింగ్‌తో డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

Also Read: Mrunal Thakur: అడుక్కుంటున్నా ఛాన్సులు రావ‌డం లేదు.. ఆవేదనంతా వెల్లగక్కిన మృణాల్!

అలాగే ఈ హ్యాండ్‌సెట్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమ‌ర్చారు. మెరుగైన గేమింగ్ అనుభవం కోసం Q1 స్వతంత్ర చిప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఐకూ నియో 9 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు MEMC(మోషన్ ఎస్టిమేషన్-మోషన్ కాంపెన్సేషన్) కోసం మద్దతుతో రాబోతోంది. వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్ ద్వారా కవర్ చేయబడుతుంది.(iQOO Neo 9 Pro)

iQOO Neo 9 Pro India Launch Date Details Here

120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. అలాగే 3D హీట్ డిస్సిపేషన్ సిస్టమ్ మరియు 1.5K రిజల్యూషన్‌తో కూడిన OLED డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. లాంచ్ ఈవెంట్ లోపు ఐకూ కంపెనీ మరిన్ని వివరాలను షేర్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఐకూ నియో 9 ప్రో స్మార్మ్‌ఫోన్‌ ఇటీవల ప్రారంభమైన వ‌న్ ప్ల‌స్ 12ఆర్ కి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.

Join WhatsApp