iQoo Neo 9 Pro Launched in India

iQoo Neo 9 Pro: ప్ర‌ముఖ టెక్ సంస్థ ఐకూ నుంచి గురువారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. అదే ఐకూ నియో 9 ప్రో(iQoo Neo 9 Pro). ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ ను ప‌రిచయం చేసింది. అదిరిపోయే ఫిచ‌ర్ల‌తో రెండు రంగుల ఎంపికలలో ఈ ఫోన్ విడుద‌ల అయింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఐకూ నియో 9 ప్రో యొక్క స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర మ‌రియు సేల్స్ కు సంబంధించిన‌ వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iQoo Neo 9 Pro Launched in India

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. క్వాల్క‌మ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ శ‌క్తిని పొందుతుంది. 12GB వరకు ర్యామ్ మరియు 256GB వ‌ర‌కు స్టోరేజ్ ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14పై నియో 9 ప్రో నడుస్తుంది. అలాగే 3 సంవత్సరాల OS అప్‌డేట్‌లను మరియు నాల్గొవ‌ సంవత్సరం సెక్యూరిటీ అప్డేట్స్‌ స్వీకరించిన మొదటి నియో సిరీస్ హ్యాండ్‌సెట్ ఇది.

అలాగే ఈ హ్యాండ్‌సెట్ iQoo యొక్క వెట్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఆప్టిక‌ల్స్ విష‌యానికి వ‌స్తే.. ఐకూ నియో 9 ప్రోలో డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ను అందించారు. ఇందులో సోనీ IMX920 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ కెమెరా మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. వీడియో కాల్స్‌ మరియు సెల్ఫీల కోసం f/2.5 అపర్చర్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను అమ‌ర్చారు.(iQoo Neo 9 Pro)

Also Read: Xiaomi 14: ఇండియా లాంచ్ కు రెడీ అవుతున్న షావోమీ 14.. అదుర్స్ అనేలా ఉన్న ఫీచ‌ర్స్‌!!

కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. ఇండియాలో ఐకూ నియో 9 ప్రోలో బేస్ మోడ‌ల్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ రూ. 37,999 ట్యాగ్ తో ప్రారంభించారు. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధ‌ర రూ. 39,999. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ మరియు iQoo ఇ-స్టోర్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ సేల్స్ ప్రారంభం అవుతాయి. ప్రీ-బుక్ చేసిన కస్టమర్‌లు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు కొనుగోలు చేయవచ్చు. ఇక‌పోతే ఐకూ నియో 9 ప్రోలో మ‌రో వేరియంట్ కూడా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మార్చి 21న కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వ‌స్తుంది. దీని ధర రూ. 35,999గా కంపెనీ నిర్ణ‌యించింది.

Join WhatsApp