Itel S24 With 108MP AI Dual Camera To Be Launched in India Soon

Itel S24 Mobile: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. రోజులు మారినా కొద్దీ ఇంకా కూడా మొబైల్స్ ఫోన్ ల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఒక్కరి దగ్గర రెండు ఫోన్లు ఉంటున్నాయి. దీంతో మొబైల్ కంపెనీలకు విపరీతంగా లాభాలు వస్తున్నాయి. రోజురోజుకు మొబైల్ కంపెనీలా షేర్ మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి. జనాలు మొత్తం మొబైల్ ఫోన్లకే డబ్బులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియాలోకి మరో కొత్త ఫోన్ రాబోతుంది. Itel S24 Mobile

Itel S24 With 108MP AI Dual Camera To Be Launched in India Soon

ఈ మేరకు ఐటెల్ కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. ఐటెల్ ఎస్ 24 అనే సరికొత్త మొబైల్ ఫోన్ ను ఇండియాలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది ఐటెల్ కంపెనీ. అయితే ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ గత మాసంలో రిలీజ్ అయింది. కానీ మన ఇండియాలో అతి త్వరలోనే రాబోతుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ పదివేల రూపాయల లోపు మాత్రమే ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 5జి ఫోన్ అయ్యుండి ఇంత తక్కువ అదరకు అందించేందుకు ముందుకు వచ్చింది కంపెనీ. Itel S24 Mobile

Also Read: Samsung Galaxy F15 5G: శాంసంగ్ అదిరిపోయే ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే..?

ఇక ఈ మొబైల్ ఫీచర్స్ అలాగే ఇతర వివరాలు పరిశీలిద్దాం. ఐటెల్ ఎస్ 24 మొబైల్ కొనుగోలు చేసే కస్టమర్లకు మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ఈ మొబైల్ కొన్నవారికి ఐటెల్ ఐకాన్ స్మార్ట్ వాచ్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. దీని ధర 2000 రూపాయలు ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో ఫోర్ జి బి రామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అలాగే 8gb ర్యామ్ విత్ 128 జిబి స్టోరేజ్, 8gb రామ్ మరియు 256 జిబి స్టోరేజ్ మోడల్స్ ఇందులో ఉన్నాయి. అంటే మొత్తం ఇందులో మూడు మోడల్స్ ఉంటాయి. అలాగే మూడు కలర్స్లో ఈ మొబైల్ ఫోన్ మనకు లభిస్తుంది. Itel S24 Mobile

డాన్ వైట్, సారీ బ్లాక్ అలాగే బ్లూ కలర్ రంగులలో ఈ ఐటెల్ ఫోన్ మనకు లభిస్తుంది. అయితే ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mah ఉంటుంది. అంతేకాకుండా 6.6 ఇంచుల డిస్ప్లే అందిస్తున్నారు. కెమెరా 108 మెగాపిక్సల్ సెన్సార్ ప్రైమరీ సెన్సార్ తో మనకు అందిస్తున్నారు. ఒక సెల్ఫీల కోసం కూడా మంచి కెమెరాలు మనకు అందిస్తున్నారు ఐటెల్ కంపెనీ వారు. అయితే దీని రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనున్నారు.Itel S24 Mobile

Join WhatsApp