Lava O2 Key Specifications Revealed

Lava O2: 2024 ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి వివిధ బ్రాండ్ల నుంచి దేశ మార్కెట్‌లోకి ఎన్నో కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని లాంచ్ కు రెడీ అవుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా లావా O2 కూడా వ‌చ్చింది. గత వారం లావా బ్లేజ్ కర్వ్‌ను ప్రారంభించిన కంపెనీ.. ఇప్పుడు లావా O2ని ఆవిష్క‌రించ‌డానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేర‌కు ఎక్స్(ట్విట్ట‌ర్‌) లో లావా ఓ టీజ‌ర్ ను పోస్ట్ చేసింది. ఇందులో హ్యాండ్‌సెట్ డిజైన్ మ‌రియు ప‌లు కీల‌క స్పెసిఫీకేష‌న్స్ ను రివీల్ చేసింది.

Lava O2 Key Specifications Revealed

లావా నుండి రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ పోస్ట్ చేసిన టీజ‌ర్ ప్ర‌కారం.. లావా O2 ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు 50MP కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది దిగువన USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. మ‌రియు స్పీకర్ గ్రిల్‌తో జత చేయబడింది. ఫోన్ కుడివైపు పవర్ మరియు వాల్యూమ్ బటన్‌లను ఇచ్చారు.

లావా O2ని గ్రీన్ క‌ల‌ర్ లో టీజ్ చేశారు. అయితే అమెజాన్ లిస్టింగ్ ప్ర‌కారం.. గ్రీన్ కలర్ ఆప్షన్‌తో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ మెజెస్టిక్ పర్పుల్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగం AG గ్లాస్‌తో తయారు చేయబడుతుంది. లావా O2 90Hz రిఫ్రెష్ రేట్ మరియు హోల్-పంచ్‌తో 6.5-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.(Lava O2)

Also Read: Motorola Edge 50 Fusion: అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే?

8GB LPDDR4x ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ జత చేయబడుతుంది. ఆక్టా-కోర్ Unisoc T616 చిప్‌తో లావా O2 అందించబడుతుందని అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 18W ఛార్జింగ్ స‌పోర్ట్ తో 5,000mAh సామార్థ్యం గ‌ల బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించ‌వ‌చ్చు. ఈ ప‌రిక‌రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అమర్చబడి ఉంటుంది. మ‌రియు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో షిప్ చేయబడుతుంది.

Join WhatsApp