Leaked Features of Google Pixel 9 and 9 Pro Smartphones

Google Pixel 9: కొత్త ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ కొత్త ఫోన్ గురించి, ఫీచర్స్ గురించి చూడండి. గూగుల్‌ పిక్సెల్‌ నుండి కొత్త ఫోన్‌ లను ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయడానికి స్టార్ట్ అవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… గూగుల్‌ పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ లను త్వరలోనే లాంచ్‌ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు గూగుల్ ఈ సిరీస్‌ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ని కూడా ఇప్పటి వరకు తీసుకు రాలేదు. ఈ ఫోన్ గురించి ఏ ప్రకటన చేయకపోయినప్పటికీ, నెట్టింట ఫోన్ కి సంబంధించి ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి.

Leaked Features of Google Pixel 9 and 9 Pro Smartphones

అయితే వాటి ఆధారంగా ఈ ఫోన్‌ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటున్నాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. మరి ఆ వివరాలు చూస్తే… ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ లాంచ్‌ చేస్తున్న గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌లో ఫీచర్స్‌ అయితే సూపర్ గా వున్నాయి. గూగుల్‌ పిక్స్‌ల్‌ 9, 9 ప్రో పేరు తో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను ఈ సిరీస్‌ లో భాగంగా తీసుకు రాబోతున్నారు. ఈ ఫోన్స్ డైమెన్ష‌న్స్‌ను 360 డిగ్రీ వీడియో లో ఆవిష్క‌రించే 5కే రెండ‌ర్స్‌ను ఇస్తున్నారు. (Google Pixel 9)

Also Read: Central Govt: ఉద్యోగులు, పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిలు…!

6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లే తో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌ హోల్ ని కూడా ఈ ఫోన్స్ కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్స్ కు రైట్‌ సైడ్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్ రాక‌ర్స్‌ తో పాటుగా ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ ని కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక డివైజ్ కింద భాగం లో అయితే యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, స్పీక‌ర్ గ్రిల్‌ ఫీచర్లను కూడా ఇస్తోంది.

Leaked Features of Google Pixel 9 and 9 Pro Smartphones
Join WhatsApp