Mobile Trick: Your old phone will become new with these small tricks

Mobile Trick: ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఎంత డబ్బు వెచ్చించి ఫోన్ కొన్నా కానీ అది మనం యూస్ చేసే కొలది కాస్త స్పీడ్ తగ్గుతుంది. ఒక్కోసారి పూర్తిగా బ్రౌజింగ్ స్పీడ్ తగ్గి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మరి అలా ఫోన్లలో స్పీడు ఎందుకు తగ్గుతుంది.. ఫోన్ స్లో అయినప్పుడు ఏ విధంగా స్పీడ్ అయ్యేలా చేయాలి.. కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం..

Mobile Trick: Your old phone will become new with these small tricks

1. చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడతారు కానీ దానిలో ఉన్న సెట్టింగ్స్ ను అస్సలు పట్టించుకోరు. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలో చాలామంది చాలా కాలం వరకు అప్డేట్ చేయరు. దీనివల్ల కొత్త సెక్యూరిటీ అప్డేట్, కొత్త ఫీచర్లు ఫోన్ లోకి రావు. దీనివల్ల ఫోన్స్ లో స్లో అయి నెమ్మదిస్తుంది.(Mobile Trick)

Also Read: Smart Doorbell: దొంగల నుండి రక్షణ కోసం.. ఇంట్లో స్మార్ట్ డోర్‌బెల్..!

2. చాలామంది ఫోన్లను వాడుతూ ఉంటారు తప్ప అందులో పేరుకుపోయినటువంటి వేస్ట్ డాటాను తొలగించరు. అంతే కాకుండా పనికిరాని యాప్ లను అన్ఇన్స్టాల్ చేయండి. మీరు సేవ్ చేసిన డేటాని కూడా తొలగించండి. దీని వల్ల కూడా ఫోన్ స్పీడ్ గా పని చేస్తుంది.

3. ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండేటువంటి మరో ఆప్షన్ కొత్త లాంచర్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో నోవా లాంచర్, యాక్షన్ లాంచర్, మైక్రోసాఫ్ట్ వంటి లాంచర్లు ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల ఫోన్ స్పీడు పనిచేస్తుంది.

Mobile Trick: Your old phone will become new with these small tricks

4. ఫోన్ కొత్త దానిలా కనిపించాలి స్పీడ్ గా పని చేయాలంటే ఫోన్ రీసెట్ చేయాలి. దీనివల్ల జంక్ ఫైల్స్ తొలగిపోతాయి. రీసెట్ చేసే ముందు ఫోన్ డేటా బ్యాకప్ తీసుకోండి. లేకపోతే ఫోన్లో ఉండేటువంటి ఫోటోలు వీడియోలు ఇతర డాటా కూడా తొలగించబడుతుంది.

Join WhatsApp