Sonia Gandhi & PM Modi Focus on Telangana

Modi Government: హైదరాబాద్లో నిర్వహించిన బిజెపి విజయసంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ సంకల్ప యాత్రకి ముఖ్యఅతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర బాయ్ పాటిల్ కి ధన్యవాదాలు చెప్పారు వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో ఎన్ని కలు జరగనున్నాయి అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతారో ఎవరు నేతృత్వంలో అవినీతి రహితదేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకి చెప్పారు. ప్రజలకి తెలుసు 2014లో మోడీ ప్రధానిగా ఎన్నికయ్యారు అప్పటినుండి దేశం ఎలా ముందుకు పోతుందో ప్రజలకి తెలుసు అని చెప్పారు.

Kishan Reddy on Modi Government

అంతకు ముందు యుపిఏ ప్రధాని ఉన్నప్పుడు పరిస్థితి ప్రజలకు తెలుసు అని అన్నారు అంతేకాకుండా పార్టీ పెద్దలు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవాడు. అప్పుడు దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు. సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని మోడీని ప్రధాని చేశారు. ఒక్క అవినీతి మచ్చలేకుండా పరిపాలన చేసిన ఘనత మోడీది ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన ప్రధాని ఎవరు అనేది సర్వే చేస్తే మోడీ పేరు ముందు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మోడీ వైపు చూస్తున్నారు. కెసిఆర్ పై విరక్తి చెందిన తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ని ఓడించారు రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఉపయోగం లేదు. త్వరలో రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది ప్రజల్ని మభ్యపెట్టి హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Also read: MLC Kavitha: బీఆర్ఎస్ కి కలిసి రాబోతున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..!!

అధికారం చేపట్టాక కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలను అమలు చేయడం సాధ్యమని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాదు అసలు రాహుల్ గాంధీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రధాని కాలేదు. మళ్ళీ గెలిచేది బిజెపి. ప్రధాని కూడా నరేంద్ర మోడీనే. మోడీని గెలిపించుకోవాలని అన్నారు. అలానే ఆ బాధ్యత మన మీద ఉంది అన్నారు అలానే కిషన్ రెడ్డి మాట్లాడుతూ అసదుద్దీన్ ఓవైసీ ని కూడా విధించాలి అని కిషన్ రెడ్డి అన్నారు. మోడీని మళ్లీ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ మోడీ కోసమే చూస్తున్నారని చెప్పారు. మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత పరిస్థితిని చూశారు కదా అని చెప్పారు (Modi Government).

Sonia gandhi and Pm Modi focus on Telangana
Join WhatsApp