Motorola Edge 50 Fusion Phone May Launch In India on April 3

Motorola Edge 50 Fusion: లెనోవా యాజమాన్యంలోని మోటరోలా భారతదేశంలో తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. నిర్దిష్ట వివరాలను వెల్లడించకుండా రాబోయే ఈవెంట్‌ను టీజ్ చేస్తోంది. అలాగే రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ కోసం ఏప్రిల్ 3 లాంచ్ తేదీని బ్లాక్ చేసింది. అయితే న్యూ ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే ఈ లాంచింగ్‌ ఈవెంట్ లో మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ ఆవిష్కరణను చూడవచ్చని ఊహాగానాలు సూచిస్తున్నాయి. ఈ మోడల్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Motorola Edge 50 Fusion Phone May Launch In India on April 3

మోట‌రోలా నుంచి రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని చెప్పబడింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ప్యాక్ చేయ‌బ‌డుతుంది. పాపులర్ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ గురించి వివరాలను వెల్లడించారు. ఆ వివ‌రాల ప్ర‌కారం.. మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల POLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.(Motorola Edge 50 Fusion)

Also Read: Vivo X Fold 3: మార్చి 26న లాంచ్‌కు సిద్ధ‌మ‌వుతున్న వివో ఎక్స్ ఫోల్డ్ 3.. ముందే లీకైన ఫీచ‌ర్స్‌!

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌తో వస్తుందని చెప్పారు. ఇంకా లాంచ్ కాని మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పబడింది. అలాగే 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ లో అందిస్తున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంద‌ట‌. ఇది దుమ్ము మరియు నీటికి నిరోధకతను కలిగిస్తుంది. మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ ఫోన్‌ పీకాక్ పింక్, బల్లాడ్ బ్లూ మరియు టైడల్ టీల్ అనే మూడు రంగు ఎంపికలలో వస్తుందని అంటున్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

Join WhatsApp