New feature in Google Map

Google Map: ప్రస్తుతం మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గూగుల్ మ్యాప్ ఉపయోగించి మనం చేరవలసిన గమ్యస్థానానికి చేరుకుంటాం. కానీ ఒక్కోసారి ఆ గమ్యస్థానానికి చేరుకుంటాం కానీ అక్కడ పరిస్థితులు, వాతావరణం ఎలా ఉందనేది తెలుసుకోవడం కష్టం. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. గూగుల్ మ్యాప్ లో సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. మనం వెళ్లవలసిన ప్రదేశానికి వెళ్లకముందే అక్కడ వాతావరణ పరిస్థితి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటంటే ఏఐ టెక్నాలజీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

New feature in Google Map

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది ప్రస్తుతం అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ మ్యాప్ లో కూడా ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ ద్వారా ఉత్త ప్రదేశాలలో ఉండేటువంటి అడ్రస్ లను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఏఐ ఫీచర్ అమెరికాలో వినియోగదారులకు మ్యాప్స్ జనరేటివ్ అందించినట్లు కంపెనీ తెలియజేసింది.ఇది ఈ వారం అక్కడ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ఆధారంగా కొత్త ప్రదేశాలకు వెళ్లకముందే అక్కడి ఫోటోలు, రివ్యూలు, వాతావరణ పరిస్థితులను కచ్చితంగా తెలియజేస్తుంది. (Google Map)

Also Read: Xiaomi Redmi A2 Vs Poco C51:ఈ 2 ఫోన్లలో ఏది బెస్ట్ అంటే..?

ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ప్రదేశం వెళ్లిన సమయంలో అక్కడ ఏదైనా వస్తువుకు సంబంధించిన విషయం కావాలి అంటే మీకు దగ్గరలో ఆ వస్తువు ఎక్కడ లభిస్తుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాటి ఫోటోలు రేట్లు కూడా తెలియజేస్తుంది. అయితే google మ్యాప్ లో మనం ఎక్కువగా ఏదైనా ఫుడ్ కి సంబంధించినటువంటి విషయాలను వెతుకుతాం. మనకు ఎలాంటి ఆహారం కావాలో అక్కడ టైప్ చేస్తే ఆ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, మనం వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది.

New feature in Google Map

ఆ ఫుడ్ కు సంబంధించిన రేటు వివరాలను ఏఐ టెక్నాలజీ అందిస్తుందట. ఈ టెక్నాలజీని ప్రస్తుతం అమెరికాలో మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలని గూగుల్ మ్యాప్ యాజమాన్యం యోచిస్తోంది. ఒకవేళ ఇది వర్క్ అవుట్ అయితే మాత్రం తప్పనిసరిగా గూగుల్ మ్యాప్ ద్వారా మరింత సులభమైన పద్ధతిలో మనం గమ్యస్థానం చేరుకోవడమే కాకుండా చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు.(Google Map)

Join WhatsApp