Noise ColorFit Hexa Specifications And Price Details

Noise ColorFit Hexa: సుప్రసిద్ధ భారతీయ స్మార్ట్ వాచ్ బ్రాండ్ నాయిస్ ఇటీవల క‌ల‌ర్ ఫిట్ క్రోమ్‌ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో నాయిస్ నుంచి మ‌రో కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. అదే నాయిస్ కలర్ ఫిట్ హెక్సా(Noise ColorFit Hexa). ఆర్క్‌వ్యూ డిస్‌ప్లే మ‌రియు వంపు తిరిగిన బాడీతో స్క్వేర్ డయల్ డిజైన్ ను ఈ వాచ్ క‌లిగి ఉంది. అలాగే రెగ్యులర్ మరియు లెదర్ స్ట్రాప్ వేరియంట్‌లలో ఈ వాచ్ ప్రారంభించ‌బ‌డింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం నాయిస్ కలర్ ఫిట్ హెక్సా స్పెసిఫికేష‌న్స్‌, ధ‌ర వివ‌రాల‌ను తెలుసుకుందాం ప‌దండి.

Noise ColorFit Hexa Specifications & Price Details

1.96-అంగుళాల AMOLED స్క్రీన్ తో నాయిస్ క‌ల‌ర్ ఫిట్ హెక్సా వాచ్ వచ్చింది. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. 360 x 360 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌వాచ్‌లోని నాయిస్ ట్రూ సింక్ టెక్నాలజీ శీఘ్ర జత మరియు తక్కువ విద్యుత్ వినియోగంతో బ్లూటూత్ కాలింగ్‌ని అనుమతిస్తుంది.

నాయిస్ హెల్త్ సూట్ విష‌యానికి వ‌స్తే.. ఇతర నాయిస్ స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే 24×7 హార్ట్ రేట్ మోన‌ట‌రింగ్‌, SpO2 కొలత, స్లీప్ ట్రాకింగ్ మరియు స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ తనిఖీ చేసే టూల్స్ ను కలిగి ఉంటుంది. అలాగే వివిధ వ్యాయామాలు మరియు క్రీడలను ట్రాక్ చేయడానికి బహుళ స్పోర్ట్స్ మోడ్‌లను ఈ స్మార్ట్‌వాచ్‌లో అందించారు. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ పరికరాలతో నోయిస్‌ఫిట్ యాప్ ద్వారా ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతంగా పనిచేస్తుంది. (Noise ColorFit Hexa)

Also Read: Lenovo Legion 9i: హార్డ్‌కోర్ గేమర్‌ల కోసం లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్ లాంచ్‌.. ధ‌ర ఎంతంటే?

రిమైండర్‌లు, వాతావరణ హెచ్చరికలు, నోటిఫికేషన్ డిస్‌ప్లే, కెమెరా మరియు మ్యూజిక్ కంట్రోల్‌, అలారం, కాలిక్యులేటర్ వంటి మరిన్ని ఫీచర్‌లు ఈ వాచ్ లో ఉంటాయి. ఉత్తమ ఫీచర్లలో బ్యాటరీ జీవితం లైఫ్ ఒక‌టి. నాయిస్ ఫిట్ యాప్‌తో జత చేసి, 7 రోజుల వరకు కలర్ ఫిట్ హెక్సా బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. నాయిస్ వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్ కలర్ ఫిట్ హెక్సా ప్రారంభ ధరగా 2,499గా నిర్ణ‌యించారు. అద‌నంగా నాయిస్ వెబ్‌సైట్ నుండి మొదటి 300 మంది కొనుగోలుదారులకు రూ.300 తగ్గింపు లభిస్తుంది. క‌ల‌ర్ ఆప్ష‌న్స్ లో టీల్ బ్లూ, క్లాసిక్ బ్రౌన్ (లెదర్), క్లాసిక్ బ్లాక్ (లెదర్), మరియు జెట్ బ్లాక్ ఉన్నాయి. త‌క్కువ బ‌డ్జెట్ లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాల‌ని భావించే వారికి నాయిస్ కలర్ ఫిట్ హెక్సా బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Join WhatsApp