Noise Vortex Plus Smart Watch that Detects Heart Function

Noise Vortex Plus Smart watch: ప్రస్తుతం మార్కెట్ లో అనేక డిజిటల్ వాచ్ లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాయిస్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి నోయిస్ వోర్టెక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ మనకు అందుబాటు లోకి వచ్చింది. ఈ వాచ్ మెష్ మెటల్, అలాగే సిలికాన్ పట్టిలతో అందుబాటులోకి రానుంది.

Noise Vortex Plus Smart Watch that Detects Heart Function

మరి ఈ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ స్మార్ట్ వాచ్ 1.46 అంగుళాల AMOLED డిస్ప్లే కలిగి ఉండడమే కాకుండా, 100 కంటే ఎక్కువ యానిమేటెడ్ వాచ్ పేస్ లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ లో ట్రూ సింక్ టెక్నాలజీ ఉండడంవల్ల బ్లూటూత్ కాలింగ్ సులభంగా చేసుకోవచ్చు.

Also Read: LG QNED: ఈ టీవీ.. రూ. 2 లక్షల కంటే ఎక్కువ.. ఏయే ఫీచర్స్ వుంటాయో తెలుసా..?

అలాగే ఈ వాచ్ లో హెల్త్ ట్రాకింగ్ ముఖ్యమైనటువంటి స్పెసిఫికేషన్. 24×7 గుండె యొక్క పనితీరును పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే స్లీపింగ్ ట్రాకింగ్, అలాగే ఒత్తిడి నిర్వహణ స్త్రీల యొక్క సైకిల్ ట్రాకింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. నాయిస్ వోర్టెక్స్ ప్లస్ వివిధ స్పోర్ట్స్ మోడల్స్ లో కూడా వస్తోంది.

Noise Vortex Plus Smart watch: New watch that detects heart function

ఇది ఫిట్ నెస్ కాన్షియస్ కూడా అందిస్తుందట. ఈ వాచ్ ధర విషయానికి వస్తే రూ:1,999 ఉన్నది. వివిధ స్టోర్లలో వివిధ రకాల కలర్స్ లో మనకు లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ జనవరి 31 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది.(Noise Vortex Plus Smart watch)

Join WhatsApp