Numberless Credit Card From Axis Bank

Numberless Credit Card From Axis Bank

Axis Bank మన ఇండియాలో ఇప్పటివరకు ఈ నెంబర్ లెస్ క్రెడిట్ కార్డులు రాలేదు. కానీ మొట్టమొదటిసారి యాక్సిస్ బ్యాంకు ఈ నెంబర్ లెస్ క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. ఫైబ్ ఫిన్ టెక్ కంపెనీతో కలిసి ఈ కార్డును ప్రవేశపెట్టినది. అయితే ఈ కార్డు అదనపు లేయర్ తో భద్రతాపరంగా ఎంతో ఉపయోగపడడం విశేషం.

క్రెడిట్ కార్డు పై ఎలాంటి నెంబర్స్ కూడా ఉండవు. ఈ క్రెడిట్ కార్డు కోసం ఫిన్ టెక్ కంపెనీ ఫైబ్ తో చేతులు కలిపింది యాక్సిస్ సంస్థ. ఇవి కస్టమర్లకు అత్యంత భద్రతను అందిస్తాయని యాజమాన్యం తెలియజేస్తోంది. ఎందుకంటే ఈ కార్డుపై సివివి, కార్డు నెంబర్ గడువు తేది ఇలాంటి రహస్య సమాచారం ఉండదు. ఒకవేళ ఈ కార్డు మనం పోగొట్టుకున్న, దొంగల చేతిలో వినియోగదారునికి ఎలాంటి నష్టం ఉండదు.

నంబర్ ఉండే క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఈ కార్డు చాలా రిస్కు తక్కువ ఉంటుంది. ఈ కార్డు వినియోగదారులు ఫైబ్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వివరాలను ఫైబ్ యాప్ లో సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల వారి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కార్డు ను రెస్టారెంట్ అగ్రిగేటర్లలో, అలాగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఈ యాప్ లలో, ఆన్లైన్ టికెట్స్ వాటిల్లో వాడితే దీనిపై మూడు శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది.

Also Read : IRCTC : రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇక సీట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఈజీ..!

అంతేకాకుండా కస్టమర్లు ఆఫ్ లైన్, ఆన్లైన్ లావాదేవీలపై ఒక శాతం క్యాష్ బ్యాక్ అందుకుంటారు. అలాగే ఈ క్రెడిట్ కార్డు రూపే ప్లాట్ఫారంలో జారీ చేయబడింది కాబట్టి క్రెడిట్ కార్డు ని యూపీఐతో లింకు చేసుకునే సదుపాయం ఉంది. అన్ని ఆన్లైన్ స్టోర్స్ లో కూడా పనిచేస్తుంది. ఈ కార్డుకు జీరో జాయినింగ్ పీజ్ జీవిత కాలం జీరో వార్షిక రుసుముంటుంది. అలాగే ఈ కార్డును పెట్రోల్ పంపుల వద్ద 400 రూపాయల నుండి 5వేల విలువైన ఇంధనాన్ని నింపడానికి ఎలాంటి సర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రూపే పోర్టు పోలియో ఆఫర్స్ అదనపు ప్రయోజనాలన్నీ ఈ కార్డుపై అందుబాటులో ఉన్నాయి. Axis Bank

Join WhatsApp